VETA NEWS MEDIA

2026-11-02
Offcanvas
Edit Template

వనపర్తి

వనపర్తి జిల్లాలో తీవ్ర దుర్భిక్షం నెలకొందని వెంటనే సహాయక చర్యలు ప్రారంభించి రైతు కూలీలను ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల నరసింహ డిమాండ్ చేశారు. సోమవారం వనపర్తి మండలం అంజనగిరి, దత్తాయిపల్లి, దత్తాయిపల్లి తండాలో సిపిఐ బృందం పర్యటించగా తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు కళ్ళకు కట్టాయి అన్నారు. అంజనగిరి కి కాసిం నగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందిస్తాం అన్న హామీని పాలకులు నెరవేర్చలేదన్నారు. బోర్లపై ఆధారపడి సాగు చేయటంతో సుమారు 100 ఎకరాల్లో వరి పంటలు ఎండిపోయాయన్నారు. పెద్ద దేవన్న రైతు నాలుగు ఎకరాల్లో వేసిన వారిపై రెండు తడులు ఇస్తే పండేదని, బోర్ లో నీళ్లు ఆగిపోవడంతో పంట ఎండిపోయిందన్నారు. మరో రైతు పొలం కరిగేట చేశారని మరు రోజు నాటేందుకు ప్రయత్నించగా బోరు ఎండిపోయిందని,ఆశతో రూ. 1,60,000 ఖర్చుపెట్టి రెండు బోర్లు తవ్విన నీళ్లు పడకపోవడంతో తీవ్రంగా నష్టపోయారని చాలామందిది ఇదే పరిస్థితి అన్నారు. దత్తాయిపల్లి, దత్తాయిపల్లి తండాలో సాగుచేసిన వరి పైరులు 80% ఎండిపోయాయన్నారు. సాగుకు అప్పులు తెచ్చామని పంట పండక పోవడంతో ఎలా తీర్చాలని ఆందోళన పడుతున్నారన్నారు. కేఎల్ఐ కాల్వ ఉందని పంట వేశారని సాగునీళ్లు రాకపోవడంతో ఎండిపోయాయన్నారు. పశువులు గొర్రెలకు మనుషులకు తాగునీటి సమస్య ఏర్పడే పరిస్థితి ఉందన్నారు. పంటలు ఎండి ప్రతి రైతు కంట్లో దుఃఖం కనిపిస్తోందన్నారు. జూన్ నెల వరకు ప్రతి నెల ప్రతి కుటుంబానికి రూ. 15000 ఇవ్వాలన్నారు. ఎండిన పంటలకు ఎకరాకు రూ. 30000 నష్టపరిహారం ఇవ్వాలని, పంట రుణాలు మాఫీ చేయాలన్నారు. రేషన్ దుకాణాల ద్వారా పేదలకు మనిషికి 15 కిలోల బియ్యం ఇవ్వాలన్నారు. ఉపాధి హామీ పనులను విస్తృతంగా చేపట్టి కూలీలకు 200 రోజులు పని కల్పించాలని, కూలి రూ. 600 ఇవ్వాలని డిమాండ్ చేశారు. మూగజీవాలను కాపాడుకునేందుకు ఉచితంగా పశుగ్రాసం ఇవ్వాలని, పశుగ్రాస కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు.

ఉమ్మడి జిల్లాలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు కేఎల్ఐ జూరాల భీమా తదితర ప్రాజెక్టుల ప్రధాన కాలువల నుంచి పిల్ల కాలువలు నిర్మించకపోవడంతో చివరి పొలాలకు సాగునీరు అందక ఎండిపోయాయన్నారు. పిల్ల కాలువల కోసం వెంటనే భూసేకరణ చేపట్టి కాల్వలు నిర్మించాలన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీరామ్, జె. చంద్రయ్య నేతలు పృథ్వినాదం, చిన్న కుర్మయ్య, శివ, కాంగ్రెస్ నేత అంజనగిరి మాజీ సర్పంచ్ నారాయణ, పలువురు రైతులు కరువు పరిస్థితులను బృందానికి వివరించారు. తదితరులు పాల్గొన్నారు.

whatsapp image 2026 11 02 at 4.46.45 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top