VETA NEWS MEDIA

2026-11-02
Offcanvas
Edit Template

వనపర్తి

ఏఐటీయూసీ 107 వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వనపర్తి పట్టణంలోని ఏరియా హాస్పిటల్ మరియు మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ నందు కార్మికులు జెండా ఆవిష్కరణ చేసి అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మోష.. సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ..కోశాధికారి భాస్కర్ లు మాట్లాడుతూ.. దేశంలో కార్మిక రంగ సమస్యల పరిష్కారం కోసం కార్మికుల యొక్క హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతూ.. కార్మికుల పక్షాన నాటి బ్రిటిష్ సామ్రాజ్యవాదంతో పోరాడిన వారసత్వంతో ఏర్పడిన ఏఐటీయూసీ నేటి ప్రజాస్వామ్య ప్రభుత్వాలలో కూడా కార్మికుల హక్కులకై నినదిస్తున్న ఏకైక మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటియుసి అని తెలిపారు… కార్మికులకు గుదిబండగా మారిన నాలుగు లేబర్ కోడ్ లను తక్షణమే రద్దు చేయాలని.. కార్మికులకు కనీస వేతనాలు 26,000 అమలు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ ఆపాలని… కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.. AITUC ఆధ్వర్యంలో దేశంలో కార్మిక పోరాటాలు నిర్వహించి కనీస వేతనాల చట్టం. ఫ్యాక్టరీ చట్టం. గ్రాడ్యుటీ చట్టం. లాంటి అనేక చట్టాలను సాధించామని తెలిపారు. రైల్వేలో బ్యాంకింగ్ లో విద్యుత్ రంగాలలో ఏఐటీయూసీ కార్మికుల పక్షాన కీలకంగా నిలబడి పోరాడుతుందన్నారు రాష్ట్రంలో సింగరేణి లాంటి పెద్ద పెద్ద ప్రభుత్వ సంస్థల్లో గుర్తింపు సంఘం గా మరియు ఇటీవల ఆర్టీసీ ఎన్నికల్లో ఎంప్లాయిస్ యూనియన్ గా AITUC గుర్తింపు పొందిందన్నారు.. సిపిఐ వనపర్తి పట్టణ కార్యదర్శి రమేష్. మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు అధ్యక్షులు రామ్ రెడ్డి లు మాట్లాడుతూ.. మెడికల్ రంగంలో కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఆ సమస్యలకు ఏఐటీయూసీ తరఫున పోరాటాలకు శ్రీకారం చుడుతున్నామని. కార్మికులకు పని భారం తగ్గించాలని. రాజకీయ ఒత్తిళ్లు వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ హాస్పిటల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గంధం శీను నరసింహ నాయకులు చిన్న కురుమయ్య. నరేందర్.శ్యామ్. కుమార్.శ్రీకాంత్.భాను.పుష్ప.సంగీత.భాగ్య తదితరులు పాల్గొన్నారు..

whatsapp image 2026 10 31 at 4.35.03 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top