VETA NEWS MEDIA

2026-10-09
Offcanvas
Edit Template

వనపర్తి

ప్రపంచ విప్లవ ధృవతార చేగువేరా అని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్, కవి జనజ్వాల అన్నారు. సిపిఐ వనపర్తి జిల్లా ఆఫీసులో సిపిఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో చేగువేరా 59వ వర్ధంతిని ప్రజా సంఘాల నేతలతో కలిసి ఘనంగా నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు చేసి నివాళులర్పించారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సమ సమాజం కోసం పోరాడి ప్రాణత్యాగం చేశారని, గెరిల్లా పోరాటంలో ఆయన చూపించిన తెగువ భావితరాలకు ఆదర్శమన్నారు. విప్లవ యోధుడు, బహుభాషా కోవిదుడు, మంత్రి రాజకీయవేత్తగా ఆయన పోషించిన పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది అన్నారు. ప్రపంచయువతరానికి ఆయన రోల్ మోడల్ అని దేశ యువతే ఆయన వారసులుగా అంతరాలు లేని సోషలిస్టు సమాజ నిర్మాణానికి నడుం బిగించాలని, అదే యువత ఆయనకిచ్చే నిజమైన నివాళి కాగలదన్నారు. కవి జనజ్వాల, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నరసింహ శెట్టి, పట్టణ సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పృథ్వినాదం,AIPSO, జిల్లా సమన్వయ కార్యదర్శి ఎత్తం శివ, సామాజిక కార్యకర్త గంధం నాగరాజు, సిపిఐ(ఎంఎల్) జిల్లా నాయకులు గణేష్, నాయకులు సురేష్ రామచంద్రయ్య విజయ్ శ్రీకాంత్ వెంకటప్ప తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు. తిరుమలేష్, నాగరాజు విప్లవ గీతాలు ఆలపించారు.

whatsapp image 2026 10 09 at 2.04.02 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top