అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని పరామర్శించిన రావుల చంద్రశేఖర్ రెడ్డి
వనపర్తి
వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గం, కొత్తకోట మండలం, కానాయిపల్లి గ్రామ సర్పంచ్ శ్రీమతి శిరీష సాయి గారి చిన్న కుమార్తె గత రెండు రోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో ఉన్న TX హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న గౌరవనీయులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆదివారం ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న చిన్నారిని పరామర్శించారు. అనంతరం చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలని, అత్యంత జాగ్రత్తగా బిడ్డను చూసుకోవాలని ఆసుపత్రిలోని సంబంధిత వైద్యులకు సూచించారు.
ఈ సందర్భంగా గ్రామ పెద్దలు నరోత్తం రెడ్డి గారు, వార్డు సభ్యులు కొత్త వెంకటయ్య గారు, బుగ్గపల్లి చిన్న వెంకటయ్య గారు, బుగ్గపల్లి శివాజీ తదితరులు చిన్నారిని పరామర్శించారు.
