కష్టజీవుల ద్రోహి బిజెపి.. గద్దె దించేందుకు పోరాడాలి : సిపిఐ
వనపర్తి
కష్టజీవుల ద్రోహి బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం అని గద్దె దించేందుకు ఐక్యంగా పోరాడాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి, సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్, ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి వంక గోపాల్ పిలుపునిచ్చారు. సిపిఐ కేంద్ర కమిటీ పిలుపుమేరకు బిజెపి నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పానగల్ మండలం తెల్లరాల్లపల్లి, కేతేపల్లి, వెంగలాయిపల్లి, బండపల్లి, బహదూర్ గూడెం చౌరస్తాల మీదుగా పాన్గల్ కు సుమారు పది కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. పాదయాత్రను సీపిఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు,NFIW ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు, కేతేపల్లి మాజీ సర్పంచ్ కళావతమ్మ ఎర్రజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నేతలు తెల్ల రాళ్లపల్లి, కేతేపల్లి, పానగల్ బస్టాండ్ లో మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ రైతులు, కూలీలు, కార్మికులు, నిరుద్యోగులు, మహిళలు, ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని యువతను, ప్రతి రైతు ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామని రైతులను, ధరలు తగ్గిస్తామని సామాన్యులను, ఉపాధి కల్పిస్తామని కూలీలను మోసం చేశారన్నారు. 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడలుగా చేసి కార్మికుల హక్కులను కాలరాచారన్నారు. అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చేసుకోవడంతో వారితో పోటీపడి మార్కెట్లో ఉత్పత్తులను అమ్మ లేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. సామాన్యుల కష్టాన్ని దోచి సంపన్నులకు పెట్టే పాలన సాగిస్తున్నారని చరమగీతం ఫలితాలు అన్నారు. సంపన్నులు దోపిడీకి వ్యతిరేకంగా రైతులు కార్మికులు అన్ని వర్గాలకు అండగా పోరాడుతుందని కార్మికరాజ్యం వచ్చేదాకా పోరాటం కొనసాగిస్తుందన్నారు. మతం, అయోధ్య పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని, రామ మందిరం నిధులు దోచుకున్న నరేంద్ర మోడీ మాట్లాడటం లేదన్నారు. మతంపై దేవునిపై బిజెపికి నమ్మకం లేదని అధికార ఒక్కటే వారి పరమావదని విమర్శించారు. దేశంలో సి జె పి పేరుతో యువత తిరగబడితే నరేంద్ర మోడీ తోకముడిచారని, శ్రమజీవులు తిరగబడితే బీజేపీ అధికారం మోసపు పాలన, సంపన్నులకు అనుకూల పాలన అంతమవుతుందన్నారు. పాదయాత్రల ప్రధాన డిమాండ్ అధిక ధరలు తగ్గింపు, యువతకు ఉద్యోగాలు, పంటల మద్దతు ధరకు చట్టబద్ధత, దళితులు ఆదివాసులపై దాడులు ఆపటం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయటం, బ్యాలెట్ పద్ధతిన ఎన్నికలు ప్రధాన డిమాండ్ తో పాదయాత్ర ఈనెల 6 నుంచి 14 వరకు జరుగుతుందని అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళావతమ్మ, సిపిఐ వనపర్తి నియోజకవర్గం కార్యదర్శి రమేష్, ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్, పానగల్ మండల కార్యదర్శి డంగు కుర్మయ్య, కేతేపల్లి ఉప సర్పంచ్ కృష్ణవేణి, ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి సంతోష్, సిపిఐ మాజీ మండల కార్యదర్శి శివకుమార్, తెల్ల రాళ్లపల్లి మాజీ ఉపసర్పంచ్ బాలస్వామి, చెన్నమ్మవార్డు సభ్యులు కురుమమ్మ, డంగు లక్ష్మి, మాజీ వార్డు సభ్యుడు పెంటయ్య, తెల్లర్లపల్లి, కేతేపల్లి, బొల్లారం, వెంగళాయిపల్లి సిపిఐ గ్రామ కార్యదర్శిసహదేవుడు,కాకం చిన్న నారాయణ, మల్లెపు బాలస్వామి, చల్మారెడ్డి, చిన్న ఎల్లయ్య, బయ్య కురుమయ్య, రామాంజనేయులు, మల్లేష్, భరత్, ఎస్ రాముడు, పరశురాముడు, మేస్త్రి రాముడు, తెలుగు లక్ష్మి, దేవమ్మ, వెంకటయ్య,తదితరులు పాల్గొన్నారు
