VETA NEWS MEDIA

2026-08-03
Offcanvas
Edit Template

వనపర్తి

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటర్ల సర్వే ప్రక్రియను నియోజకవర్గంలో నూరు శాతం విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పిలుపునిచ్చారు. మండల స్థాయి నాయకులు ఈ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించి, బీఎల్ఏ-2 ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పూర్తి ఉత్సాహంతో పనిచేసేలా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. బుధవారం వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సర్ ప్రక్రియ పురోగతిని సమీక్షించి పలు కీలక సూచనలు చేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రతి కార్యకర్తే బలమని అన్నారు పార్టీ కోసం అందరూ ఐక్యతతో, క్రమశిక్షణతో, సమన్వయంతో పనిచేసినప్పుడే విజయాన్ని సాధించగలమని పేర్కొన్నారు. ప్రస్తుతం సర్ ప్రక్రియకు సమయం చాలా తక్కువగా ఉన్నందున మనకు ఉన్న గడువులోనే 100 శాతం నమోదు పూర్తి చేయడం ప్రతి ఒక్కరి లక్ష్యంగా ఉండాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. బీఎల్ఏ-2 ప్రతినిధులు ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను కలిసి ఎన్యూమరేషన్ ఫారాలను సక్రమంగా నింపించాలని సూచించారు. మండల నాయకులు ప్రత్యేక దృష్టి సారించి, బీఎల్ఏ-2ల పనితీరును ప్రతిరోజూ సమీక్షించాలని, అవసరమైన చోట మార్గనిర్దేశం చేయాలని అన్నారు. ప్రతి గ్రామం, ప్రతి బూత్‌లో సమన్వయంతో పనిచేస్తే లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి, అసెంబ్లీ ఇన్‌చార్జ్ శత్రురావు బుజ్జి, ప్రజాప్రతినిధులు, వివిధ మండలాల అధ్యక్షులు, బీఎల్ఏ-2 ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

whatsapp image 2026 07 29 at 6.31.35 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top