VETA NEWS MEDIA

2026-08-03
Offcanvas
Edit Template

వనపర్తి

నీట్ విద్యార్థుల ఆత్మహత్యలు కేంద్ర ప్రభుత్వ హత్యలేనని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ విమర్శించారు. సిపిఐ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సిపిఐ వనపర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వనపర్తి అంబేద్కర్ చౌక్ లో నీట్ రద్దు వల్ల కలత చెంది ఆత్మహత్య చేసుకొని అమరులైన 23 మంది విద్యార్థులకు కొవ్వొత్తులతో సాయంత్రం నివాళులర్పించి వారి ఆశయాలను సాధిస్తామని నినాదాలు చేశారు. నీట్ మరో విద్యార్థిని కూడా ఆత్మహత్య చేసుకుందని కేంద్రపాపం ఎందరిని బలి తీసుకుంటుందో తెలియదని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యార్థి మృతులకు రూ. కోటి పరిహారంఇవ్వాలని, దేశవ్యాప్తంగా ఉద్యమంలో పాల్గొన్న యువకులు విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలన్న డిమాండ్లకు అంగీకరించిన కేంద్రం బీహార్ బెంగాల్ అస్సాం తదితర రాష్ట్రాల్లో విద్యార్థులపైఎఫ్ఐఆర్ నమోదు చేసిఅరెస్టు చేయటం దారుణం అన్నారు. రేపటిలోగాకేసులను ఎత్తేయకపోతే మళ్లీ ఉద్యమిస్తామని సీజెపి అల్టిమేట్ ఇచ్చిందని,ఇచ్చిన హామీలన్నీ చిత్తశుద్ధితో అమలు చేయాలని, విద్యా వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళావతమ్మ, ఐప్సో సమన్వయ కార్యదర్శి శివ సామాజిక కార్యకర్తలు గంధం నాగరాజు, బాలెమియా ఎన్ఎఫ్ఐ డబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి, ఉపాధ్యక్షురాలు జయమ్మ మాట్లాడుతూ.. కేంద్రం నిరుద్యోగ యువకులు విద్యార్థులపై కక్షపూరిత వైఖరిని అనుసరించటం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం దారుణం అన్నారు. హామీలను అమలు చేయకుంటే మళ్లీ ఉద్యమం తప్పదని పార్టీ పూర్తిస్థాయిలో మద్దతు ఇచ్చి పోరాడుతుందన్నారు. సిపిఐ నేతలు కళావతమ్మ ,కృష్ణవేణి, జయమ్మ ,గంధం నాగరాజు, చిన్న కుర్మన్న, బాలేమియా, లక్ష్మీనారాయణ, సురేష్ ,మల్లెపు నరసింహ, చందు, మంద సురేష్ శివ వంశి సైదులు తదితరులు పాల్గొన్నారు.

whatsapp image 2026 07 27 at 7.46.21 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top