VETA NEWS MEDIA

2026-08-03
Offcanvas
Edit Template

వనపర్తి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) CPM పెబ్బేరు మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం పెబ్బేరు మండల విద్యా అధికారి ఎంఈఓ కి సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం పెబ్బేరు మండలంలో ఉన్న ప్రైవేటు విద్యాసంస్థలపై సర్వే నిర్వహించడం జరిగింది . సర్వేలో వచ్చిన సమస్యలను సిపిఎం పార్టీగా ఎంఈఓ జయ రాములు కి వినతి పత్రం అందజేయడం జరిగింది అనంతరం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మండ్ల రాజు , సిపిఎం కార్యదర్శి మాజీ ఎంపీటీసీ జి బాలయ్య మాట్లాడుతూ పెబ్బేరు మండలంలో ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తూ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంగిస్తూ ఇష్టారాజ్యంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ పేద విద్యార్థుల తల్లిదండ్రులను పీడిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు 21 వేల రూపాయలు నాలుగో తరగతి ఐదో తరగతి విద్యార్థులకు 30 వేల రూపాయలు పైతరగతులకు 50 వేల నుండి 60 వేల రూపాయల వరకు అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారు పాఠ్యపుస్తకాల పేరుతో వేల వేల రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారు స్కూల్ యూనిఫాంలో పేరుతో ప్రైవేటు పాఠశాల యజమాన్యమే వ్యాపారాలు చేస్తూ వేల రూపాయలు గడిస్తున్నారు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నారు కోర్టు తీర్పు 25 శాతం పేద విద్యార్థులకు ఉచిత విద్య అమలు చేయాలి కానీ వాటిని నిబంధనలకు ప్రైవేటు విద్యాసంస్థల యజమానులు పాటించటం లేదు నిబంధనల ప్రకారం ప్రైవేటు విద్యాసంస్థలు ఏ తరగతి విద్యార్థికి ఎంత ఫీజు తీసుకోవాలో నోటీస్ బోర్డులో రాయాలని కోరారు ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీకి వ్యతిరేకంగా విద్యార్థుల తల్లిదండ్రులతో సిపిఎం పోరాటాలు ఉదృతం హెచ్చరించారు ఈ సిపిఎం నాయకులు ఆర్ భాస్కర్ ఎం వెంకటస్వామి పి ఊసన్న జి మన్యం తదితరులు పాల్గొన్నారు

whatsapp image 2026 07 13 at 4.09.59 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top