VETA NEWS MEDIA

2026-08-03
Offcanvas
Edit Template

వనపర్తి

వనపర్తి నియోజకవర్గంలోని ఏదుల రిజర్వాయర్ నిర్మాణంలో ముంపుకు గురైన కొంకలపల్లి గ్రామానికి చెందిన 47 మంది లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.2 కోట్ల 34 లక్షలను మంజూరు చేసింది. ఈ మేరకు శుక్రవారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి వనపర్తి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు సత్తి చేసిన కార్యక్రమంలో సంబంధిత లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఏదుల రిజర్వాయర్ నిర్మాణం చేపట్టి తమ పొలాలు, ఇండ్లు కోల్పోయి పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చిందని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ గత పాలకులు తమ సమస్యలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం తమ కష్టాలను గుర్తించి ప్రతి కుటుంబానికి నష్టపరిహారం అందజేయడం ఆనందదాయకమని, తమకు న్యాయం జరుగుతోందనే నమ్మకం కలిగిందని లబ్ధిదారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు మాట్లాడుతూ ముంపు బాధితుల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు పొలాలు, ఇండ్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందేలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారి దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ముంపు బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డ్ అధ్యక్షులు, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, గోపాల్పేట ఉమ్మడి మండల మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షులు సత్య శీలా రెడ్డి, రేవల్లి మండల అధ్యశులు సుల్తాన్ గ్రామ సర్పంచ్ బాలనాగయ్య, కాంగ్రెస్ పార్టీ మాజీ మండలాధ్యక్షులు పర్వతాలు, లోడి రఘు, ఆర్డిఓ ఎంఆర్ఓ, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు

whatsapp image 2026 07 03 at 12.57.06 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top