VETA NEWS MEDIA

2026-08-03
Offcanvas
Edit Template

వనపర్తి

వనపర్తి పట్టణంలోని గాంధీచౌక్ యూకో బ్యాంక్ లైన్‌లో వైద్యులు డాక్టర్ బంగారయ్య నూతనంగా నిర్మించిన ప్రపంచ్ ఆసుపత్రిని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు సేవాభావంతో కూడిన వైద్య సేవలను అందించాలని, ఆపద సమయంలో ఆసుపత్రికి వచ్చే నిరుపేద ప్రజలను వ్యాపార దృక్పథంతో కాకుండా మానవత్వంతో ఆదుకోవాలని సూచించారు. వైద్య వృత్తి అనేది అత్యంత పవిత్రమైనదని, ప్రతి వైద్యుడు సేవా తత్వంతో పనిచేస్తే సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. దిన దిన అభివృద్ధి చెందుతున్న వనపర్తి ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో డాక్టర్ బంగారయ్య గారు ఆధునిక సౌకర్యాలతో ఆసుపత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ ఆసుపత్రి ద్వారా పట్టణ ప్రజలతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, పట్టణ అధ్యక్షులు కదిరె రాములు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బి కృష్ణ, వనపర్తి పట్టణ కౌన్సిలర్లు sln రమేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

whatsapp image 2026 07 02 at 2.34.54 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top