VETA NEWS MEDIA

2026-08-03
Offcanvas
Edit Template

వనపర్తి

వనపర్తి జిల్లా కేంద్రంలో రూ.22 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆధునిక ఇంటిగ్రేటెడ్ టవర్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి పట్టణాన్ని ఆధునిక నగరంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు
వనపర్తి జిల్లాను సాంకేతిక రంగంలో ముందంజలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందన్నారు. ఈ IT టవర్ నిర్మాణం ద్వారా జిల్లా యువతకు స్థానికంగానే ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గి, యువత తమ స్వస్థలంలోనే ఉద్యోగాలు పొందే అవకాశం కలుగుతుందన్నారు సాఫ్ట్‌వేర్ కంపెనీలు, స్టార్టప్ సంస్థలు వనపర్తికి రావడానికి ఈ టవర్ కీలక వేదికగా మారనుందని పేర్కొన్నారు. అత్యాధునిక సదుపాయాలతో నిర్మించబడనున్న ఈ IT టవర్ ద్వారా డిజిటల్ సేవలు మరింత విస్తరించడంతో పాటు కొత్త పెట్టుబడులు జిల్లాకు ఆకర్షితమవుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని వనపర్తిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఐటి టవర్ నిర్మాణానికి 22 కోట్ల రూపాయలను మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుకి ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, పట్టణ అధ్యక్షులు కదిరే రాములు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బ్రహ్మచారి, బి కృష్ణ, పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, సింగల్ విండో అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, డైరెక్టర్లు, సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

whatsapp image 2026 07 01 at 2.36.35 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top