కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే తండాల అభివృద్ధి
వనపర్తి
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గిరిజనతాండాలని అభివృద్ధి చెందాయని వనపర్తి నియోజకవర్గ పరిధిలోని తండాల అభివృద్ధికి రెండున్నర సంవత్సరాలలో 45 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. ఎస్టీ రిజర్వేషన్లు కల్పించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గిరిజన ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేపట్టిన బస్సు యాత్ర శనివారం కొల్లాపూర్ నుంచి వనపర్తి నియోజకవర్గానికి చేరుకుంది. ఈ సందర్భంగా వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి గారు, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివసేన రెడ్డి నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలు అన్ని గ్రామాల నుంచి 8000 మందితో ర్యాలీగా వెళ్లి బస్సు యాత్రకు స్వాగతం పలికారు. వనపర్తి పట్టణ శివారు మెట్టుపల్లి నుంచి మోటార్ సైకిల్ ర్యాలీతో అంబేద్కర్ చౌరస్తా కు చేరుకున్న నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి పాదయాత్రగా బయలుదేరి రాజీవ్ చౌరస్తా మీదుగా ఇందిరాగాంధీ పార్కు వద్దకు చేరుకొని స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు
అనంతరం రాజీవ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యేలు మురళి నాయక్, రామచంద్రనాయక్, బాలు నాయక్ రాందాస్ నాయక్, ఎంపీ బలరాం నాయక్మా జీ ఎమ్మెల్సీలు శంకర్ నాయక్ రాములు నాయకులతో పాటు బేలయ్యనాయక్ రవీందర్ నాయక్ లు మాట్లాడారు గిరిజన రిజర్వేషన్ కల్పించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చేపట్టిన ఇందిరమ్మ ఆశీర్వాద స్వర్ణోత్సవ బస్సుయాత్ర వనపర్తి కి చేరుకున్న సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆధ్వర్యంలో తమకు ఇంత ఘనంగా స్వాగతం పలికిన గిరిజన సహోదరులందరికీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మొదటగా కృతజ్ఞతలు తెలియజేశారు.స్వతంత్రం వచ్చిన నాటి నుంచి గిరిజనుల సంక్షేమానికి పాటుపడిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలంగాణ రాష్ట్రంలోని గిరిజనులంతా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారని వారు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రెండున్నర సంవత్సరాలలో గిరిజన తండాలలో ప్రతీ నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిందని, ఉచిత కరెంటు నిస్తోందని, రేషన్ కార్డును అందజేసి నిరుపేద గిరిజనులకు సన్నబియాని పంపిణీ చేస్తూ మూడు పూటలా భోజనాన్ని అందిస్తుందని వారన్నారు. గిరిజనులు రిజర్వేషన్ కేటాయించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను మననం చేసుకుంటూ ఈ యాత్ర చేపట్టినట్లు వారు పేర్కొన్నారు. వనపర్తి నియోజకవర్గ పరిధిలో ఇంత పెద్ద ఎత్తున తమకు స్వాగతం పలికి ఈ సమావేశానికి హాజరైన మీరు ఎప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరువకూడదన్నారు. గతంలో తండాలకు వెళ్లాలంటే రోడ్డు సౌకర్యం కూడా సరిగా లేదని నేడు ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి తండాకు పటిష్టమైన తారు రోడ్లు నిర్మించుకున్నామని వారి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గిరిజనుల పక్షపాతి అని గిరిజనుల అభివృద్ధి కోసం ఆయన అహర్నిశలు కష్టపడుతున్నారని వారి పేర్కొన్నారు. కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, మార్కెట్ యార్డ్ చైర్మన్, శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, గిరిజన నాయకులు మాజీ ఎంపీపీ శంకర్ నాయక్, సర్పంచ్ వాళ్లే నాయక్, గిరిజన గ్రామ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ప్రజా ప్రతినిధులతో పాటు, అన్ని మండలాల గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
