VETA NEWS MEDIA

2026-06-18
Offcanvas
Edit Template

వనపర్తి

పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడు పోలీసు శాఖ తనకు అండగా ఉందనే నమ్మకంతో తిరిగి వెళ్లాలి. బాధితులకు న్యాయం చేయడం, ప్రజలకు భద్రత కల్పించడం, నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించడం ప్రతి పోలీసు అధికారికి ప్రధాన బాధ్యతని జిల్లా ఎస్పీ సునిత రెడ్డి అన్నారు. గురువారం వనపర్తి జిల్లా పరిధిలోని పెద్దమందడి పోలీస్టేషన్ ” వార్షిక తనిఖీలలో ” భాగంగా వనపర్తి జిల్లా ఎస్పీ శ్రీమతి సునిత రెడ్డి సందర్శించి తనిఖీ చేశారు. ముందుగా పోలీస్టేషన్ చేరుకున్న ఎస్పీ గారికి పోలీసు అధికారులు పూల మొక్కలందజేసి స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి పోలీస్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో వాహనాల పార్కింగ్ ప్రదేశాలు, రిసెప్షన్, స్టేషన్ రైటర్, టెక్ టీమ్, ఎస్ హెచ్ వో, మెన్ రెస్ట్ రూమ్ , లాక్ అప్ రూమ్ ను తదితర ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ…పెద్దమందడి పోలీస్టేషన్ పరిధిలో గంజాయి, మట్కా, పేకాట లాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పర్యవేక్షించాలన్నారు. సాయంత్రం సమయాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదాలను అరికట్టాలన్నారు. ముఖ్యంగా కేసుల దర్యాప్తునందు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సరైన సమయంలో దర్యాప్తు చేసి కోర్టుల నందు చార్జిషీటు దాఖలు చేసినప్పుడు బాధితులకు సరైన న్యాయం జరుగుతుందని తెలిపారు. దీర్ఘ కాలికంగా పెండింగ్లో ఉన్న కేసుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పోలీసు సిబ్బంది మాట్లాడుతూ పోలీసుశాఖ అందించిన కిట్ ఆర్టికల్స్ ను పరిశీలించి వాటిని జాగ్రత్తగా ఉంచుకోవాలని తెలిపారు. అలాగే సిబంది నిర్వహిస్తున్న విధులు, పని తీరు, వారికీ ఏదైనా సమస్యలు ఉన్నాయ అని తెలుసుకుని ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురావాలనని స్టేషన్ పరిధిలో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయి అడిగి తెలుసుకొని గ్రామ పోలీస్ అధికారులు గ్రామాలను పూర్తిగా సమాచారం సేకరించి నేరాలు నిర్ములించాలని తెలిపారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ కోర్టును ప్రారంభించి పాఠశాల విద్యార్థులతో వాలీబాల్ ఆడారు ఈ వార్షిక తనిఖీ కార్యక్రమంలో వనపర్తి డిఎస్పీ, గిరిబాబు , కొత్తకోట సీఐ,రాంబాబు , పెద్దమందడి ఎస్సై,జలంధర్ రెడ్డి , డిసిఆర్బి ఎస్సై, తిరుపతి రెడ్డి,పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

whatsapp image 2026 06 18 at 6.54.27 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top