రవీంద్ర భారతి బీసీ ముస్లిం సన్మాన సభ
వనపర్తి
హైదరాబాదు రవీంద్ర భారతి లో బీసీ సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ ముస్లిం సన్మాన సభకు వనపర్తి జిల్లా నుండి అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ అతిథిగా హాజరయ్యారు. రవీంద్ర భారతి లో జరిగిన ఈ సభకు ముఖ్యఅతిథిగా మాజీ డిజిపి పూర్ణచందర్ రావు , తొలివెలుగు రఘు , అమిత్ భాషా , మాజీ ఎమ్మెల్సీ సయ్యద్ భాషా , డా” సతీష్ యాదవ్ శ్రీనివాస్ సాగర్ తదితరులు హాజరై ముస్లిం బీసీ కళాకారులు పాడిన పాటలను, ఆటలను, చూసిన తర్వాత ఉమ్మడి జిల్లాలు అయిన ఖమ్మం, మహబూబ్నగర్, వరంగల్, నల్గొండ, ఆదిలాబాద్, మెదక్, హైదరాబాద్ జిల్లాల నుండి వచ్చిన సర్పంచ్ లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కొన్ని జిల్లాల నుండి వచ్చిన ముస్లిం నాయకులు, బీసీ నాయకులు, సర్పంచులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
