జమ్ములమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా
వనపర్తి
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మృగశిర కార్తీ సందర్భంగా 23వ వార్డులో జమ్ములమ్మ ఆలయం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ గతములో దేవాలయ నిర్మాణాన్నికి 5లక్షల రూపాయలు కేటాయించి అభివృద్ధికి కృషి చేశామని భవిష్యత్తులో ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అభివృద్ధి చేస్తామని అన్నారు. పట్టణ ప్రజలు జమ్ములమ్మ దేవత ఆశీషులతో పాడిపంటలతో సుఖసంతోషాలతో సౌభాగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. నిరంజన్ రెడ్డి కి నాయకులు మెకానిక్.శ్రీను,ఉంగ్లం. తిరుమల్ ,నందిమల్ల.శారదా అశోక్ ఘనంగా స్వాగతం పలికి ఆహ్వానించారు. మాజీ మంత్రి వెంట గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ నందిమల్ల.అశోక్ సబ్బిరెడ్డి.యుగంధర్ రెడ్డి, శ్రీనివాస్పూర్.నరసింహ,వీర సాగర్,సూర్యవంశం.గిరి,చిట్యాల.రాము, పెద్దముక్కల.రవి,ఇమ్రాన్,మునికుమార్,చెన్నారెడ్డి, సబ్బిరెడ్డి. రవీందర్ రెడ్డి, ఎంట్ల.శ్రీను, గౌనికాడి.యాదయ్య,తోట.శ్రీను,కుమ్మరి.రామస్వామి తదితరులు ఉన్నారు.
