వ్యవసాయ కార్మిక మహాసభలు జయప్రదం చేద్దాం
వనపర్తి
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఈ నేల 20న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలు జయప్రదం చేస్తూ భారీ బహిరంగ నిర్వహించడం జరుగుతుంది వనపర్తి జిల్లా కార్మిక వర్గం వెయలాది మంది కార్మికులు పాల్గోని జయప్రదం చేయాలనీ కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన CITU జిల్లా విస్తృతస్థాయి సమావేశాము CITU జిల్లా అధ్యక్షులు R N రమేష్ అధ్యక్షతన CITU జిల్లా కార్యాలయంలో ప్రారంభము అయుంది ఈ సమావేశంను ఉద్దేశించి CITU జిల్లా కార్యదర్శి మండ్ల రాజు, CITU జిల్లా అధ్యక్షులు R N రమేష్ మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులకు అండగా ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో తెచ్చిన విబి-జి రామ్ జి చట్టం వ్యవసాయ కార్మికులకు గొడ్డలిపెట్టుగా ఉందని అన్నారు. రెండు రెక్కలే ఆస్తిగా, చెమట చుక్కలే పెట్టుబడిగా, గొడ్డు చాకిరి చేసి మొత్తం సమాజానికి తిండి అందిస్తున్న శ్రామిక వర్గం, వ్యవసాయ కార్మికులు అని అన్నారు. అలాంటి వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఈ దేశంలో కార్మికులను వ్యవసాయ కార్మికులను మోసం చేసే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాలుగు లేబర్ కోడ్స్ తీసుకొచ్చి అణిచివేస్తుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి, వ్యవసాయ కార్మికులను నిర్లక్ష్యం చేస్తూ కార్పొరేట్ సంస్థలకి ఈ దేశ సంపదను కట్టబెడుతున్నారు అన్ని అన్నారు. ఈ దేశంలో కార్మికులకి వ్యవసాయ కార్మికులకు తిండి, బట్ట, ఇల్లు, సాగు భూమి, కనీస వేతనం, ఉపాధి, విద్య, వైద్యం, అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 20న ఉమ్మడి మహబూబ్ నగర్ పట్టణంలో మున్సిపల్ టౌన్ హాల్ నుంచి జూనియర్ కాలేజ్ గ్రౌండ్ వరకు వేలాది మంది కార్మికులతో ఎర్రజెండా దండు భారీ ప్రదర్శన, అనంతరం భారీ బహిరంగ సభ జరుగుతుందని ఈ సభకి త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ గారు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగిస్తారని, ఉమ్మడి మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి కర్మిక వర్గం, వనపర్తి జిల్లా కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పుట్ట ఆంజనేయులు సునీత సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ రాజు, బాలగౌడ్, జిల్లా నాయకులు D కురుమయ్య, A బుచ్చన్న, వెంకటయ్య, నందిమాళ్ళ రాములు, జానకి రాముడు, చెన్నమ్మ, దేవమ్మ, సత్యమ్మ, తదితరులు పాల్గొన్నారు.
