VETA NEWS MEDIA

2026-06-18
Offcanvas
Edit Template

వనపర్తి

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రతి ఇంటికి చేరేలా  కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి  పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నా బలమైన సంకల్పంతో నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు శ్రీ డాక్టర్ మల్లు రవి చేపట్టిన రథయాత్ర సోమవారం వనపర్తి జిల్లాలోకి జిల్లాలోకి ప్రవేశించడం జరిగింది.  ఈ సందర్భంగా వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి , జిల్లా అధ్యక్షులు శివసేనరెడ్డి పెబ్బేరు పట్టణంలో బస్సు యాత్రకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు బస్సులో ప్రయాణం చేస్తూ పెబ్బేరు పట్టణంలోని వీధుల గుండా పర్యటించారు. అనంతరం సుభాష్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల అభ్యున్నతికి ఎంతగానో తోడుపాటునందిస్తుందని  ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి అండగా నిలబడుతుందన్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం  వడ్డీ లేని రుణాలు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు చైర్మన్లుగా పాటు పాఠశాలల్లో విద్యార్థులకు వంట ఏజెన్సీలుగా మహిళలే ఉండటం స్కూల్ విద్యార్థులకు మహిళలే స్కూల్ డ్రెస్లను కుట్టించి ఇవ్వడం ఆర్టీసీ బస్సులకు ఓనర్లను చేయడం మహిళా భాగస్వామ్యంతో సోలార్ ప్లాంట్ లో ఏర్పాటు మహిళలకు డీజిల్ బంకుల ఏర్పాట్లు రైతు రుణమాఫీ
రైతు భరోసా భూమిలేని నిరుపేదలకు రైతు ఆత్మీయ భరోసా సన్న వడ్లకు బోనస్ అన్నదాతలకు రాయితీపై వ్యవసాయ ఉపకరణానికి సంబంధించిన అన్ని పనుముట్ల పంపిణీ
తమ సొంత ఇంటి కల నెరవేరక ఇబ్బందులు ఎదుర్కొనే ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు రేషన్ కార్డుల పంపిణీ ఉచిత సన్న బియ్యం పంపిణీ విద్యార్థులకు మెస్ చార్జీల పెంపు ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటు కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు ఫిష్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు పెబ్బేరుల 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు వనపర్తి పెబ్బేరు మున్సిపాలిటీలలో ప్రతి వార్డులో సిసి రోడ్ల నిర్మాణం లాంటి అనేక పథకాలను చేపట్టి నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇట్టి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మన నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు చేపట్టిన రథయాత్ర కార్యక్రమం జోగులాంబ గద్వాల జిల్లాలలో ముగించుకుని నేడు వనపర్తికి రావడం ఆనందదాయకమని ఆయన అన్నారు. కార్యక్రమంలో  నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇంచార్జ్ మధుసూదన్ రెడ్డి, పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి, పట్టణ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, మండలాధ్యక్షులు యాపర్ల రామిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సాయిచరణ్ రెడ్డి,  జిల్లా డిసిసిబి అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, బోయల రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప, పెబ్బేరు మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు ప్రమోదిని రెడ్డి, ఉపాధ్యక్షులు విజయవర్ధన్ రెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజేష్, గోపాల్పేట మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షులు సత్యశీల రెడ్డి, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు యుగంధర్ రెడ్డి, మణిగిల్ల తిరుపతిరెడ్డి,  మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

whatsapp image 2026 06 08 at 3.42.53 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top