VETA NEWS MEDIA

2026-06-18
Offcanvas
Edit Template

వనపర్తి

పోలీస్ శాఖలో దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాల పాటు సేవలందించి ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన ఎ ఎస్ ఐ సుబ్బరాజును సాహితీ కళా వేదిక సభ్యులు సోమవారం వనపర్తిలో ఆయన స్వగృహంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ పనిని దైవంగా భావించి వృత్తి ధర్మాన్ని చిత్త శుద్ధితో నిర్వహించారని, ఏనాడు విధుల పట్ల నిర్లక్ష్యం చూపలేదని కొనియాడారు.మూడున్నర దశాబ్దాలకు పైగా సాగిన తన ఉద్యోగ జీవితంలో ఉత్తమ వ్యక్తిత్వంతో బాధ్యతాయుతంగా పని చేశారని అన్నారు.ఆయన పోలీస్ శాఖకు అందించిన సేవలకుగాను ఉన్నతాధికారుల ప్రశంసలతో పాటు జిల్లా యంత్రాంగం పక్షాన ఉత్తమ సేవా పురస్కారాలు కూడా అందుకున్నారని వివరించారు. కళా వేదిక ప్రతినిధులు సుబ్బరాజు దంపతులను శాలువ జ్ఞాపికలతో సత్కరించారు. ఈనాటి కార్యక్రమంలో ఆర్డి ఎస్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు చిన్నమ్మ థామస్,ప్రధానోపాధ్యాయులు గణేష్ కుమార్,వ్యాఖ్యాత బైరోజు చంద్ర శేఖర్,బండారు శ్రీనివాస్, ఓమేష్,రుకునందన్,ఎడ్విన్,మింటా రోస్ థామస్ తదితరులు పాల్గొన్నారు.

whatsapp image 2026 06 08 at 5.15.42 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top