VETA NEWS MEDIA

2026-06-18
Offcanvas
Edit Template

వనపర్తి

మహిళా రైతులను ఓదార్చి అధైర్య పడొద్దు అండగా ఉంటాంఅని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి భరోసా ఇచ్చారు. పెబ్బేర్ మండలంలో గుమ్మడం,పాత సుగూరు,రంగాపురం,పెబ్బేరు గ్రామాలలో పర్యటించి తడిసిన,మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించి రైతులను ఓదార్చి అధైర్య పడొద్దు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కాలములో యూరియా లేక,కరెంట్ సరఫరా లేక,రైతు భరోసా లేకున్నా ఓర్చుకొని ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు కొనుగోలు లేక పడిగాపులు కాస్తూ రైతులు విలవిలాడుతున్నారని నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
అష్టకష్టాలు పడి ధాన్యం తరలిస్తే క్వింటాలుకు 10కిలోల తరుగు తీస్తూ రైతులను జలగల లాగ పీడిస్తున్నారని నిరంజన్ రెడ్డి దుయ్యబట్టారు. వెంటనే తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేసి వారంలోపల రైతులను ప్రభుత్వం ఆదుకోకపోతే రైతుల పక్షాన పోరాడుతాము నిరంజన్ రెడ్డి హెచ్చరించారు.
నిరంజన్ రెడ్డి గారి వెంట వనం.రాములు,కర్రీస్వామి,దిలీప్ రెడ్డి,అఖిల్ చారి, పెద్దింటి.వెంకటేష్,జగన్నాథం నాయుడు,ఎం.రాజశేఖర్,కృష్ణా రెడ్డి,ఎద్దుల సాయి కుమార్,ఎల్లారెడ్డి,గోవిందు నాయుడు మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

707581136 17970661311059646 7034572842028204270 n

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top