VETA NEWS MEDIA

2026-06-18
Offcanvas
Edit Template

వనపర్తి

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన మహిళా వారోత్సవాల సందర్భంగా వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామంలో రూ. 4 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్లాంట్ పనులను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర సర్కార్ ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. వనపర్తి జిల్లాలో మొదటగా వనపర్తి మండలంలోని సవాయిగూడెం మరియు ఆత్మకూరు మండలాలకు ఈ సోలార్ ప్లాంట్లను ప్రభుత్వం మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు మహిళా సాధికారత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేపట్టిందని వడ్డీ లేని రుణాలను, ఆర్టీసీ బస్సులకు ఓనర్లను, అమ్మ ఆదర్శ పాఠశాలకు చైర్మన్గా, డీజిల్ బంకులకు ఓనర్లుగా, పాఠశాల విద్యార్థులకు బట్టలు కుట్టి వారిగా, పాఠశాలలో వంటలు చేసేవారిగా, క్యాంటీన్ నడిపేవారీగా, మహిళల పేరుపై రైసుమిల్ల ఏర్పాటు, గోదాంల నిర్మాణం, ఇలాంటి అనేక కార్యక్రమాలను చేపట్టి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. రెండేళ్ల కాలంలో ఇచ్చిన హామీలే కాకుండా కొత్త హామీలను కూడా అమలు చేశామని మిగతా హామీలు కూడా వెంటనే నెరవేరుస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పదేళ్లు పాలనలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ సొంత బిడ్డను ఇంటిలో నుంచి తరిమేసే పరిస్థితి ఉందని అలాంటివారు రాష్ట్ర లోని మహిళలు అభివృద్ధిని ఎందుకు కోరుకుంటారు అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ఎన్నో చేస్తుందని రానున్న కాలంలోనూ కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ దీవించాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కిమ్యా నాయక్, డిఆర్డిఓ ఉమాదేవి, మండల మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, మైనార్టీ నాయకులు రహీం, గ్రామాల సర్పంచులు మహిళా సంఘం సభ్యురాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

whatsapp image 2026 05 27 at 4.27.49 pm (1)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top