VETA NEWS MEDIA

2026-06-18
Offcanvas
Edit Template

వనపర్తి

మాజీ ఎమ్మెల్యే జయ రాములు కి ఆదివారం మర్రికుంట లోని ఆయన సమాధి దగ్గర అఖిలపక్ష ఐక్యవేదిక, టిడిపి, డీ.ఎస్.పి, బి.ఎస్.పి, కాంగ్రెస్, బి ఆర్ ఎస్ , ప్రజా సంఘాల నాయకులుచే ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక అధ్యక్షుడు డా సతీష్ యాదవ్ మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గాన్ని నీతివంతంగా అభివృద్ధి చేసిన నాయకుడు జయరాములు ని వనపర్తికి పాలకేంద్రం, కోర్టు, బస్టాండు సాధించిన వ్యక్తి జయరాములు గారిని, వనపర్తికి డిగ్రీ కళాశాల స్థాపించి విద్యాపర్తి చేసిన వ్యక్తిగా రికార్డ్ సాధించాడని కొనియాడారు. ముఖ్య అతిథులుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, రాష్ట్ర కార్యదర్శి రాము యాదవ్, డీఎస్పీ అధ్యక్షుడు రామకృష్ణ మహారాజ్, టిడిపి నాయకులు ఆవుల శీను, చిన్నయ్యా యాదవ్, సాహితీ కళావేదిక అధ్యక్షుడు శంకర్ గౌడ్, కిరణ్ కుమార్, బీఎస్పీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి మైబూస్, గంధం నాగరాజు, దేవన్న నాయుడు తదితరులు జయ రాములు గారి గురించి మాట్లాడిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో జయ రాములు గారి కుటుంబ సభ్యులు, వనపర్తి నియోజకవర్గం బీసీ నాయకులు చీర్ల చందర్, మాజీ కౌన్సిలర్ కృష్ణ బాబు, కాంగ్రెస్ నాయకులు బొంబాయి బాలకొండయ్య, సమద్, వెంకటేశ్వర్లు, టిడిపి పట్టణ అధ్యక్షులు కాగితాల లక్ష్మయ్య, యాదవ ఉద్యోగ సంఘం ప్రధాన కార్యదర్శి గురు రాజ్ యాదవ్, విజేత రాములు, గంధం బాలరాజు, p.et మురళి , శివకుమార్, నాగరాజు, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

whatsapp image 2026 05 24 at 10.59.22 am

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top