VETA NEWS MEDIA

2026-06-18
Offcanvas
Edit Template

వనపర్తి

ఆరుగాలం శ్రమించి పండించిన పంటను చివరి దాన్యపు గింజ వరకు కొంటామని రైతులు ఎక్కడ అధైర్య పడాల్సిన అవసరం లేదని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పెద్దమందడి మండలం వీరాయపల్లి గ్రామంలో FPO (రైతు ఉత్పత్తిదారుల సంఘం) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా సమైక్య, PACS, మెప్మా, ల తో పాటు FPO లను సైతం ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో వీరాయపల్లిలో వారి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కార చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కొనుగోలు నిరంతరాయంగా కొనసాగుతున్న వలన అక్కడక్కడ లారీలు, గన్ని బస్తాల సమస్య ఉన్న అధికారులు వెంటనే పరిష్కరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అధికారులు ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అన్నదాతలు ఎలాంటి ఆందోళనలకు గురికాకూడదనీ మీరు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే ప్రతి ప్రతి ధాన్యపు గింజలు కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు రాజప్రకాష్ రెడ్డి, వనపర్తి మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి. డైరెక్టర్లు వెంకటయ్య, వెంకటరామిరెడ్డి, బాల్ రెడ్డి, లక్ష్మణ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సత్యారెడ్డి మాజీ జెడ్పిటిసి వెంకటస్వామి, సర్పంచులు మాజీ సర్పంచులు మాజీ ఎంపిటిసిలు, నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు

whatsapp image 2026 05 08 at 1.03.23 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top