VETA NEWS MEDIA

2026-06-18
Offcanvas
Edit Template

వనపర్తి

రైతులకు కొనుగోలు విషయంలో ఎలాంటి ఆటంకాలకు తావివ్వద్దు. వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తో మాట్లాడిన డిసిసి చీఫ్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి
ఐకెపి సెంటర్స్, దళారులు తరువు పేరుతో రైతులను మోసం చేస్తున్నారని రైతులు శివసేన రెడ్డికి విన్నవించారు.
వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కి చరవాణి ద్వారా సమాచారాన్ని చేరవేసి.. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిందిగా కోరడమైనది. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతిగా ప్రభుత్వం పని చేస్తుంది. రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి కావలసిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం నిర్ణీతమైన తేమ శాతం ప్రకారం కొనుగోలు చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, చిన్న చిన్న పొరపాట్లు ఉంటే సరి చేయాలని అధికారులకు సూచించారు. దళారులు మోసం చేసిన రైతులకు తెలియని పరిస్థితుల్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, అందుకు ముందస్తు ప్రణాళికలతో కొనుగోలు కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తనతకుండా చూడాలని తెలిపారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top