VETA NEWS MEDIA

2026-06-18
Offcanvas
Edit Template


Veta News Wanaparthy : బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి
రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీలు పోరాటం చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి పేర్కొన్నారు. నేపాల్ లో జెఎన్ జీ ఉద్యమం. తమిళనాడులో టీవీకే అధికారంలోకి రావడాన్ని గమనిస్తే తెలంగాణలోనూ మెజారిటీ ప్రజలైన బీసీలు పోరాడితే 2029లో అధికారం దక్కడం ఖాయమని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి బుధవారం రోజున ఒక ప్రకటనలో కనిపిస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్, భాజపా, భరాస పార్టీలు సామాజిక న్యాయం పాటించడం లేదని, బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించడం లేదని పేర్కొన్నారు. జనగణనలో బీసీ కుల గణన చేయకుండా కేంద్రం అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. మహిళా బిల్లుల్లో బీసీలకు సబ్ కోటా పెట్టకుండా 40 కోట్ల మంది బీసీ మహిళలను భాజపా అవమానించిందని బిసి పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ అన్నారు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top