వనపర్తి
అన్నదాతలు ఎవరు కూడా అధైర్య పడరాదని, వారు సాగుచేసిన వరి, మొక్కజొన్న పంటలను చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం శ్రీరంగాపూర్ , పెబ్బేరు మార్కెట్ యార్డులో PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నదాతలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా వారు పండించిన పంటను కొనుగోలు కేంద్రాలలో విక్రయించవచ్చునని దళారుల మాటలు నమ్మే మోసపోకూడదు అని ఎమ్మెల్యే సూచించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే అన్నదాతలకు ఎలాంటి సమస్యలు రానివ్వకుండా నిర్వాహకులు ప్రత్యేక దృష్టి దృష్టి సారించాలన్నారు.ధాన్యాన్ని విక్రయించిన అన్నదాతల పేర్లను వెంటనే నమోదు చేయాలని వారికి ధాన్యం విక్రయ సొమ్మును వెంటనే వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన వారికి సూచించారు. కార్యక్రమంలో పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి, పెబ్బేరు మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు ప్రమోదిని రెడ్డి, ఉపాధ్యక్షులు విజయవర్ధన్ రెడ్డి, కౌన్సిలర్లు, పెబ్బేరు మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు, శ్రీరంగాపురం మండల నాయకులు శ్రీహరి రాజు, అధికారులు తదితరులు పాల్గొన్నారు
