VETA NEWS MEDIA

2026-06-18
Offcanvas
Edit Template

ప్రజల నెత్తిన బిజెపి గ్యాస్ బండ.. తక్షణం ఉపసంహరించాలి: సిపిఐ

వనపర్తి

వాణిజ్య సిలిండర్ ధరను రూ. 993 కు పెంచి వినియోగదారుల బిజెపి పాణిజ్య గ్యాస్ బండ వేసిందని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ విమర్శించారు. శనివారం సిపిఐ ఆఫీస్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.‌ 19 కిలోల సిలిండర్ రూ. 2321 ఉండేదని ఏకంగా రూ. 993 పెంచడంతో రూ. 3315కు పెరిగిందన్నారు. ఒకేసారి సిలిండర్ పై ఇంత ధర పెంపు బిజెపి పాలనలోనే జరిగిందన్నారు. ఇది పరోక్షంగా ప్రజలపైనే భారం పడుతుందన్నారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ఉపయోగించి హోటల్లు రెస్టారెంట్లు టీ దుకాణాల తినుబండారాలు తయారు చేస్తారని, గ్యాస్ ధరపించడంతో వాటి రేట్లు అమాంతం పెంచేసి అవకాశం ఉందన్నారు. వనపర్తి జిల్లాలో మామూలు హోటల్లో అధికంగా ఉంటాయని ఎక్కువమంది గ్యాస్ ను ఉపయోగిస్తారని వారు తయారు చేసే ఉత్పత్తులపై ధర పెంచుతారు అన్నారు. ఈ ధర రూ. 10 ఉందని అమాంతము 15కి పెరిగే అవకాశం ఉందన్నారు. టిఫిన్లు ధరలు రూ. 50 నుంచి 60 ఉన్నాయని రూ. 80 కి పెంచే అవకాశం ఉందన్నారు. తన ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు ఆసుపత్రులకు వెళ్లేవారు అనివార్యంగా ఓటర్లు రెస్టారెంట్ లోనే భోజనం టిఫిన్ చేయాల్సి వస్తుందని వారందరిపై భారం పడుతుందన్నారు. బిజెపి చెప్పే మాటలకు చేతలకు పొంతనలేదన్నారు. పెంచటం లేదంటూనే ధరలు పెంచుతూ సామాన్యులను నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే డీజిల్ పెట్రోల్ సరఫరా లో కేంద్ర విఫలమైందని వాడి ధరలు కూడా పెంచే ఆలోచనలో ఉందన్నారు. వంటగ్యాస్ సిలిండర్ ధర పెంపు కూడా ఎంతో దూరంలో లేదన్నారు. ధరలు పెంచమంటూనే పెంచి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలను సమీకరించి ప్రతిఘటించి తీరుతామన్నారు. పెంచిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను తక్షణం రూ. 2215 కు తగ్గించాలని డిమాండ్ చేశారు. సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, సీనియర్ నేత పృథ్వినాదం, శేఖర్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top