వనపర్తి
ప్రజా ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ల వంటివని, రెండింటిని సమానంగా ముందుకు తీసుకుపోవడమే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి పేర్కొన్నారు. శనివారం వనపర్తి పట్టణంలోని దాచా లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ నందు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వనపర్తి నియోజకవర్గ స్థాయి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితోపాటు అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, జెడ్పి సీఈవో యాదయ్య, వనపర్తి మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. కార్యక్రమానికి ముందుగా తెలంగాణ గీతాన్ని ఆలపించి, సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని చదివి వినిపించారు. అనంతరం వనపర్తి నియోజకవర్గం లో ప్రజా ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను లబ్ధి పొందుతున్న వారి వివరాలను తెలియజేసారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గం లో ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు రుణ మాఫీ పథకం ద్వారా 29,455 మంది రైతులకు రూ. 201 కోట్ల లబ్ది చేకూర్చడం జరిగింది అన్నారు. రైతు భరోసా కింద 83,964 మంది రైతులకు రూ. 91 కోట్ల పెట్టుబడి సాయం అందించమన్నారు. 2025-26 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 26,678 మంది రైతుల నుంచి ధాన్యం సేకరించి రూ. 286 కోట్లు వారి ఖాతాల్లో వేసినట్లు తెలిపారు. వనపర్తి నియోజకవర్గంలో 74,846 రేషన్ కార్డులు ఉండగా వాటిలో 35,837 కార్డులు ప్రజా ప్రభుత్వం లో కొత్తగా జారీ చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గం లో 30,812 లబ్ధిదారులకు గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందించి కరెంటు బిల్లుల భారం తగ్గించిందాన్నారు. అదేవిధంగా నియోజకవర్గం లో మొత్తం 3978 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి సొంతం ఇంటి కల నెరవేర్చమన్నారు. కార్యక్రమం లో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, పెబ్బేరు మున్సిపల్ వైస్ చైర్మన్ సుమిత్ర, పెబ్బేరు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ ప్రమోదిని, సిపిఓ హరికృష్ణ, డిఆర్డిఓ ఉమాదేవి, జిల్లా స్థాయి అధికారులు, కౌన్సిలర్లు ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
