_వనపర్తి
పెద్దమందడి మండలం మణిగిల్ల కాంగ్రెస్ సేవాదల్ సీనియర్ నాయకుడు సీతారాములు గౌడ్ ఇటీవలే గుండెపోటుతో అకాల మరణం చెందారు, ఇట్టి విషయాన్ని మణిగిల్ల కాంగ్రెస్ నాయకుల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శుక్రవారం వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు. వారి కుటుంబానికి ఎల్లవేళలా తోడుగా ఉంటానని కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మనిగిళ్ల గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
