VETA NEWS MEDIA

2026-06-18
Offcanvas
Edit Template

ఆత్మశుద్ధి,పవిత్ర సంకల్పం కోసమే హజ్ యాత్ర

వనపర్తి

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మైనారిటీ అధ్యక్షులు జోహెబ్ హుస్సేన్ ఆధ్వర్యములో జరిగిన హజ్ యాత్రికుల అభినందన సభలో పాల్గొని హజ్ యాత్రికులను ఘనంగా సన్మానించారు.హజ్ యాత్ర చేస్తున్న ఇంతియాజ్,గూడు.మహమూద్,అజీమ్,అబూ బకర్, అనీస్,సలీం,మతీన్,ఫరూక్,అజీజ్ ఖాన్,మాలిక్ ఖాన్,ఫైజాన్,మహమూద్,అజ్మత్ మరియు కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మశుద్ధి మరియు పవిత్ర జీవిత సంకల్పం కోసమే ముస్లిం సోదరులు హజ్ యాత్ర చేస్తారని అన్నారు. హజ్ యాత్రతో శక్తివంతమైన ఆత్మస్థైర్యం కలిగి లోక కళ్యాణం కోసం కృషి చేస్తారని పవిత్ర లక్ష్యంతో సాగే యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. రాబోవు రోజులలో తెలంగాణలో సుపరిపాలన రావాలని అల్లాను ప్రార్థించాలని ఆకాంక్షించారు. హజ్ యాత్రికులకు సన్మానం,విందు ఏర్పాటు చేసిన జోహెబ్ హుస్సేన్ ను అభినందించారు. ఈ కార్యక్రమములో గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ పలుస రమేష్ గౌడ్ నందిమల్ల అశోక్,కౌన్సిలర్.శ్రీకర్ గౌడ్,బండారు.కృష్ణ,సమద్,స్టార్.రహీమ్,చిట్యాల రాము, యూసుఫ్, డ్యానియల్,హారీఫ్,ఏ.కె.పాషా,ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top