VETA NEWS MEDIA

2026-06-18
Offcanvas
Edit Template

ఆర్.టి.సి కార్మికులారా అధైర్యపడకండి

వనపర్తి

ఆర్.టి.సి కార్మికులు చేస్తున్న మూడవరోజు సమ్మెకు మాజీ మంత్రి తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా రవాణా వ్యవస్థ రూపకల్పన చేసింది నిజాం నవాబు అని అనాటి నుండి ఆర్.టి.సి కి వేల కోట్ల ఆస్తులు కలిగి ఆర్.టి.సి సంస్థ ఎదిగిందని అన్నారు.అటువంటి ఆర్.టి. సి సంస్థ కె.సి.ఆర్ గారి హయాములో ఆర్.టి.సి కార్మికుల సంక్షేమం కోసం ఆస్తుల పరిరక్షణ కోసం ప్రభుత్వం కృషి చేసిందని తెలిపారు. ఆర్.టి.సి సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడానికి చట్టాన్ని రూపొందించి గవర్నర్ అనుమతి కోసం పంపడం జరిగింది అని నాటి గవర్నర్ కాలయాపన వల్ల సాధ్యం కాలేదని వివరించారు. వేతన సవరణ 44శాతం అందించింది కూడా కె.సి.ఆర్ గారని కొనియాడారు. ప్రజాస్వామ్యంలో సమస్యల పరిష్కారం కోసం పోరాడడం మన ప్రాథమిక హక్కు అటువంటి ప్రాథమిక హక్కును కూడా నేటి ప్రభుత్వం ఉక్కుపాదంతో అణగ తొక్కడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆర్.టి.సి కార్మికులు గతములో సమ్మె చేస్తే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వంలో సంస్థను విలీనం చేస్తామన్న రేవంత్ రెడ్డి మాట నిలుపుకొని వెంటనే ఆర్.టి.సి కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆర్.టి.సి కార్మికుల ఆందోళనకు సంపూర్ణంగా అండగా ఉంటూ పోరాటం చేస్తామని నిరంజన్ రెడ్డి హెచ్చరించారు.whatsapp image 2026 04 24 at 12.29.59 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top