వనపర్తి
వనపర్తి పట్టణాన్నికి చెందిన పేదింటి అమ్మాయి ఎన్.అమూల్య(విశ్వకర్మ) వివాహం ఈ నెల 26న జరగనుంది.ఇట్టి విషయాన్ని నాయకులు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి దృష్టికి తీసుకురాగా స్పందించిన నిరంజన్ రెడ్డి గారు ఎన్.అమూల్యను ఆశీర్వదించి పుస్తే మెట్టే మరియు నూతన వస్త్రాలు అందించారు. ఆత్మీయ కానుక అందుకున్న అమూల్య కుటుంబ సభ్యులు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమములో పలుస.రమేష్ గౌడ్, నందిమల్ల అశోక్,కౌన్సిలర్.శ్రీకర్ గౌడ్,బంగారు.అనిల్,మోహనా చారి,ప్రసాదా చారి,చాణక్య చారి,నాగరాజు,రాము తదితరులు ఉన్నారు.
