VETA NEWS MEDIA

2026-08-17
Offcanvas
Edit Template

వనపర్తి

వనపర్తి, పెబ్బేరు సివరేజ్ (మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టులకు) రూ.29.20 కోట్లు మంజూరు. వనపర్తికి రూ.20 కోట్లు పెబ్బేరుకు రూ.9.20 కోట్లు ముఖ్యమంత్రి మాన్యశ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి కి, జిల్లా ఇన్చార్జి మంత్రిదామోదర్ రాజనర్సింహ కి జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు కి , వాకిటి శ్రీహరికి నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి కి, ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి వనపర్తి, పెబ్బేరు మున్సిపాలిటీలలో (సివరేజ్) మురుగునీటి నిర్వహణ వ్యవస్థను ఆధునికీకరించేందుకు రూ.29.20 కోట్లతో సివరేజ్ ప్రాజెక్టులకు ప్రభుత్వం మంజూరు ఇచ్చింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వనపర్తి పట్టణంలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు పట్టణ పారిశుధ్యాన్ని మెరుగుపరిచేలా సివరేజ్ ప్రాజెక్టు చేపట్టాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఎమ్మెల్యే విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి తక్షణమే సంబంధిత అధికారులతో చర్యలు తీసుకుని ప్రాజెక్టులకు ఆమోదం కల్పించారు. స్వచ్ఛ భారత్ మిషన్ (SBM) 2.0 కింద, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) విధానంలో LS కాంట్రాక్ట్ సిస్టమ్ ద్వారా చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో వనపర్తి మున్సిపాలిటీకి రూ.20 కోట్లు, పెబ్బేరు మున్సిపాలిటీకి రూ.9.20 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా పట్టణాల్లో ఇళ్ల నుంచి, వాణిజ్య సముదాయాల నుంచి వెలువడే మురుగునీటిని శాస్త్రీయంగా సేకరించి, సివరేజ్ వ్యవస్థ ద్వారా తరలించి, శుద్ధి చేసి సురక్షితంగా నిర్వహించే సదుపాయాలు అభివృద్ధి చెందనున్నాయి. తద్వారా పట్టణ పారిశుధ్యం మెరుగుపడటంతో పాటు ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ఎంతో మేలు చేకూరుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని, వనపర్తి నియోజకవర్గంలో పట్టణాభివృద్ధికి మరింత ప్రాధాన్యత కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

whatsapp image 2026 08 10 at 2.36.27 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top