
వృద్ధులకు అండగా నిలవడం మన కర్తవ్యంవనపర్తి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చౌడేశ్వరి మాత వృద్ధాశ్రమానికి రెండు క్వింటాళ్ల బియ్యం వితరణ చేశారు. నిరంజన్ రెడ్డి తరపున బియ్యాన్ని జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ అందజేశారు.ఈ సందర్భంగా నందిమల్ల.అశోక్ మాట్లాడుతూ నిరంజన్ రెడ్డి గతంలో వృద్ధాశ్రమానికి ఐదేండ్లు అల్పాహారం,భోజనం అందించారని అన్నారు. ఇటీవల ఆశ్రమ నిర్వాహకులు ఎస్.రాము తమకు సహాయం అందించాలని కోరగా స్పందించిన నిరంజన్ రెడ్డి రెండు క్వింటాళ్ల బియ్యం వితరణ చేస్తూ ఇతరత్ర అవసరాలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు అని నందిమల్ల అశోక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గంధం.పరంజ్యోతి, సూర్యవంశం.గిరి,స్టార్.రహీమ్,సునీల్ వాల్మీకి,గౌడ్ నాయక్,కృష్ణయ్య,రాజు తదితరులు ఉన్నారు.