కేంద్రమంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి : NFIW,CPI
వనపర్తి
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ మైనర్ బాలికపై లైంగిక దాడికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఎన్ఎఫ్ఐ డబ్ల్యు జిల్లా అధ్యక్షులు, కేతేపల్లి ఉప సర్పంచ్ కృష్ణవేణి, ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు మాజీ సర్పంచ్ కళావతమ్మ, సిపిఐ జిల్లా కార్యదర్శి కే శ్రీరామ్, సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ డిమాండ్ చేశారు. పానగల్ మండలం కేతేపల్లి బస్టాండ్ లో బండి సాయి భగీరథ్ మైనర్ బాలికపై లైంగిక దాడికి ఎన్ఎఫ్ఐ డబ్ల్యు, సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలను పూజించే గౌరవించే దేశం మనదని, సనాతన ధర్మాన్ని కాపాడుతామని బిజెపి నేతలు గొప్పలు చెబుతారని, ఆచరణలో నీచంగా వ్యవహరిస్తారని విమర్శించారు.కరీంనగర్లో మైనర్ బాలికపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడి దురాగతం దీనికి తాజా ఉదాహరణ అన్నారు. బిజెపి పాలిత మణిపుర్ రాష్ట్రంలో గతంలో ఇద్దరుమహిళలను నగ్నంగా ఊరేగించారని గుర్తు చేశారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యంలో ఎదిగిన బండి సంజయ్ తన కుమారుడికి సత్ప్రవర్తన నేర్పించడంలో ఎందుకు విఫలమయ్యారని ప్రశ్నించారు. తండ్రిగా కుమారునికి సత్ప్రవర్తన నేర్పించడంలో వైఫల్యానికి ఆయన నైతిక బాధ్యత వహించాన్నారు. లైంగిక దాడిపై బాలిక కుటుంబ సభ్యులు సాయి భగీరథ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఫోక్సో కేసు నమోదు చేసినా ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదన్నారు. సామాన్యుల పిల్లలు లైంగిక దాడి నేరానికి పాల్పడితే ఫోక్సో కేసు పెట్టి, వెంటనే నిందితులను అరెస్టు చేస్తారని దొరకకపోతే తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారని మరి బండి సంజయ్ కుమారుని అరెస్ట్ చేయకుండా పోలీసులు ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. సామాన్యుడికి ఒక నీతి ఉన్నత పదవుల్లో ఉన్న వారికి మరొక నీతా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సాయి భగీరథ అరెస్టుపై ఆలస్యాన్ని ఖండించారు. బాధ్యత గల కేంద్ర మంత్రిగా తన కొడుకును పోలీసులకు సరెండర్ చేయాలని లేదా నైతిక బాధ్యత వహించి కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. రాజీనామా చేయకుంటే ప్రధాని జోక్యం చేసుకొని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సాయి భగీరథ కూడా తనపై హానీ ట్రాప్ జరిగిందని పోలీస్ స్టేషన్లో బాలిక కుటుంబంపై ఫిర్యాదు చేశారని ఇంతకంటే దారుణం మరొకటి ఉండదన్నారు. ఇది కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం అని, సాయి భగీరథను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని లేదంటే సిపిఐ, అనుబంధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎన్ఎఫ్ఐ డబ్ల్యు ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు కళావతమ్మ ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరామ్ సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ ,సిపిఐ మండల కార్యదర్శి డంగు కుర్మయ్య, మాజీ వార్డు సభ్యుడు కమ్మావులపెంటయ్య ,వార్డు మెంబర్ మాల కురువమ్మ, సిపిఐ కేతపల్లి గ్రామ శాఖ కార్యదర్శికాకం చిన్న నారాయణ, కాకం కాశన్న, రామాంజనేయులు, బాలస్వామి, ఎల్లయ్య, ఎల్లమ్మ, రామదాసు, కాకం కాశన్న, నీలమ్మ ,బొక్కలమ్మ, సాయి లీల ,బోయ చిన్న కుర్మయ్య ,బీరయ్య, ధర్మయ్యతదితరులు పాల్గొన్నారు
