VETA NEWS MEDIA

2026-06-20
Offcanvas
Edit Template

వనపర్తి

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వాసవి క్లబ్ మరియు వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యములో వనితా క్లబ్ సభ్యులు అత్యంత భక్తి శ్రద్ధలతో నెలరోజులపాటు తమ, తమ స్వగృహాలలో “మణిద్వీప వర్ణన పారాయణం”చేసుకొని నేడు మంగళగౌరి దేవి సామూహిక కుంకుమార్చన,అభిషేక పూజలు దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ నందు నిర్వహించబడ్డాయి. నిర్వాహకుల ఆహ్వానం మేరకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇట్టి పూజ కార్యక్రమములో పాల్గొని ప్రజలంతా సౌభాగ్యంగా,సుభిక్షంగా,ఆయురారోగ్యాలతో,అష్టాయిశ్వర్యలతో ఉండాలని మహిళలు మణిద్వీప వర్ణన పారాయణం మరియు గౌరీదేవి కుంకుమార్చన, అభిషేక పూజలు నిర్వహించడం అభినందనీయమని,ఆర్యవైశ్య సామాజిక సేవా సమితి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక సేవలో భాగస్వామ్యులు కావడం నిజంగా అభినందనీయం అని కొనియాడారు. నిర్వాహకులు నిరంజన్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు గట్టు.శశి,రజిత,రాధిక ,ప్రశాంతి,మంజుల,రాఘవేంద్ర,హరీష్,కార్తీక్ లను మాజీ మంత్రి సన్మానించారు. మాజీ మంత్రి వెంట వాకిటి.శ్రీధర్, పలుస.రమేష్ గౌడ్, నందిమల్ల.అశోక్,నాగన్న యాదవ్, దేవర్ల.నరసింహ,చిట్యాల.రాము తదితరులు ఉన్నారు.

whatsapp image 2026 06 19 at 12.32.56 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top