VETA NEWS MEDIA

2026-06-20
Offcanvas
Edit Template

వనపర్తి

“మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును చీకటిలోకి నెట్టే సామాజిక శాపం. డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి యువతను సరైన మార్గంలో నడిపించాలి. ప్రజల సహకారంతో వనపర్తి జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని జిల్లా ఎస్పీ శ్రీమతి సునిత రెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం, దివ్యాంగులు, వృద్ధులు , ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ డైరెక్టర్, హైదరాబాద్ గారి ఆదేశాల మేరకు శుక్రవారం రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో జూన్ 17 నుండి 26 వరకు నషా ముక్త్ సప్తః వారోత్సవాల సందర్బంగా వారం రోజులు అవగాహన కార్యక్రమాలలో భాగంగా అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ “నషా ముక్త్ భారత్ అభియాన్” పోస్టర్ ను జిల్లా ఎస్పీ శ్రీమతి సునిత రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలు వ్యక్తిగత జీవితాలను మాత్రమే కాకుండా కుటుంబాలు, సమాజం మరియు దేశ భవిష్యత్తును కూడా తీవ్రంగా దెబ్బతీస్తాయని అన్నారు. ముఖ్యంగా యువత డ్రగ్స్ బారిన పడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు మరియు అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నషా ముక్త్ భారత్ అభియాన్” కార్యక్రమం ద్వారా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం, యువతను సరైన మార్గంలో నడిపించడం మరియు డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి అందరూ భాగస్వాములు కావడం అత్యంత అవసరమని ఎస్పీ పేర్కొన్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్‌బీ డీఎస్పీ,బాలాజీ, జిల్లా సంక్షేమ శాఖ అధికారి శ్రీమతి కె. సుధారాణి గారు,జిల్లా బాలల పరిరక్షణ అదికాకరి, రాంబాబు, జిల్లా సంక్షేమ సూపరిండెంట్ అరుంధతి, చైల్డ్ ప్రొటెక్షన్ డీసీపీయూ అధికారులు . ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

whatsapp image 2026 06 19 at 5.07.02 pm (1)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top