VETA NEWS MEDIA

2026-06-18
Offcanvas
Edit Template

June 17, 2026/

వనపర్తి

జిల్లాలో ప్రవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఫీజులు, పాఠ్యపుస్తకాలు, యూనిఫారాల పేరుతో విద్యార్థులను దోచుకుంటున్నాయని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఇన్చార్జ్ రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తనిఖీలు చేసి పాఠశాలల దూపిడిని అరికట్టాలని డీఈఓ ఆఫీస్ సూపరిండెంట్ కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలో విచ్చలవిడిగా ప్రైవేటు పాఠశాలలు దోచుకుంటున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని ఆరోపించారు. ఎల్కేజీ కి రూ. 20వేల నుంచి రూ. 40 వేలు, ఆరవ తరగతి నుంచి 10 వరకు రూ. 60 వేల నుంచి రూ. లక్ష వసూలు చేస్తున్నారన్నారు. వేర్వేరు కంపెనీల పేరు చెప్పి పాఠ్యపుస్తకాలను పాఠశాలల్లో అధిక ధరలకు విద్యార్థులకు అంటగడుతున్నారని, పాఠశాల యూనిఫారాల పేరుతో వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు. పలు పాఠశాలలకు అనుమతులు లేవని, ప్రభుత్వం నిర్దేశించిన సౌకర్యాలు క్రీడామైదానాలు గదులు లేకున్నా ఫీజులు మాత్రం తగ్గించటం లేదన్నారు. పాఠశాలలను డీఈవో తనిఖీ చేసి దోపిడీ చేస్తున్న పాఠశాలలపై కేసులు పెట్టాలన్నారు. ఇష్టారాజ్యంగా ఫీజులను వసూలు చేయకుండా ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో ఫీజుల పట్టికను పెట్టాలని జిల్లా కలెక్టర్ ఫీజులను నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దోపిడీ ఇలాగే కొనసాగితే విద్యార్థులను సమీకరించి పాఠశాలల వద్ద ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి వంశీ, ఉదయ్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

whatsapp image 2026 06 17 at 6.42.47 pm

June 17, 2026/

వనపర్తి

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన కలకొండ రమేష్ చంద్ర ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి శాలువాతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతల్లో విజయవంతంగా రాణించాలని, ఆర్యవైశ్య సమాజ అభివృద్ధికి విశేష సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజ సేవలో వారి పాత్ర మరింత విస్తరించాలని అభిలషించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గారి వెంట గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, ఉంగ్లం తిరుమల్, ప్రేమ్ నాథ్ రెడ్డి, నరసింహ, చిట్యాల రాము, ఎల్ అశోక్ సాయి ప్రసాద్ శెట్టి మంజుల గట్టు శశి వై వెంకటేష్ బెల్లం రాజు , బద్రి తోట శీను, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

whatsapp image 2026 06 17 at 11.50.30 am

June 17, 2026/

వనపర్తి

వనపర్తి నియోజకవర్గ పరిధిలోని గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు.
ఈ క్రమంలో 10 గ్రామ పంచాయతీ (GP) భవనాలు ఒక్కో దానికి రూ.20 లక్షలు మొత్తం రూ. 2 కోట్లు, 11 అంగన్‌వాడీ కేంద్రాలు: 132.00 లక్షలు (ఒక్కో దానికి రూ ల.12 లక్షలు) , 30 విలేజ్ ఆర్గనైజేషన్ (VO) భవనాలు రూ. 300.00 లక్షలు (ఒక్కో దానికి రూ.10 లక్షలు), 8 వ్యవసాయ గిడ్డంగులు (Storage Godowns) రూ 240.00 లక్షలు (ఒక్కో దానికి రూ.30 లక్షలు), మహిళా శక్తిభవనం: రూ.20.00 లక్షలు, 2 వర్క్‌షెడ్ భవనాలు: రూ.20.00 లక్షలు (ఒక్కో దానికి రూ.10 లక్షలు), మొత్తం మంజూరైన నిధులు: రూ.9,12,00,000/- (9 కోట్ల 12 లక్షల రూపాయలు), మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతన్నలకు అండగా, మహిళా సాధికారతకు గ్రామాల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా ఈ నిధులను మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

whatsapp image 2026 06 17 at 12.08.41 pm

June 17, 2026/

వనపర్తి

అమరచింత మండలం కొంకన్వాని పల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను అప్గ్రేడ్ చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండి కుతుబ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐదవ తరగతి నుండి ఏడో తరగతి వరకు పెంచాలని బుధవారం పాఠశాల ముందు విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ పాఠశాలను అప్డేట్ చేస్తానని మంత్రి వాకిటి శ్రీహరి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని లేనిపక్షంలో ఆందోళన చేపడుతామని కుతుబ్ హెచ్చరించారు.

whatsapp image 2026 06 17 at 1.26.54 pm

ప్రైవేటు పాఠశాలల దోపిడీ.. తనిఖీలు చేసి కేసులు పెట్టాలి : రమేష్ వనపర్తి జిల్లాలో ప్రవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఫీజులు, పాఠ్యపుస్తకాలు, యూనిఫారాల పేరుతో విద్యార్థులను దోచుకుంటున్నాయని ఏఐఎస్ఎఫ్ జిల్లా …

Editor's Pick

Follow Us

Facebook

23k Likes

Twitter

56k Followers

YouTube

58k Subscribers

Instagram

80k Followers

307ce493 b254 4b2d 8ba4 d12c080d6651

Hello, I’m TV Times Voice Admin

Editor and curator at TV Times Voice, delivering verified news and insights across politics, business, technology, startups, and local affairs with clarity and integrity.

Most Read

Scroll to Top