VETA NEWS MEDIA

2026-06-20
Offcanvas
Edit Template

June 19, 2026/

వనపర్తి

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ భారతదేశ యువతకు ఆదర్శమని, ఆయన స్ఫూర్తితో యువత ముందుకెళ్లాలని వనపర్తి డిసిసి చీఫ్, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి అన్నారు. శుక్రవారం రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వనపర్తి డిసిసి చీఫ్ శివసేన రెడ్డి అధ్యక్షతన ఘనంగా వేడుకలు జరిగాయి. కాంగ్రెస్ శ్రేణుల మధ్య రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని కేకు కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రజల సంక్షేమం సామాజిక న్యాయం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. దేశ ప్రజల సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రజా సమస్యల పరిరక్షణకు సంబంధించిన పోరాటం యువతకు స్ఫూర్తినిచ్చి ప్రేరణగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజా శ్రేయస్సు కోసం మరింత కృషి చేస్తున్న నాయకుడు భావితరాల భవిష్యత్తు, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీనాన్ని నాయకుల ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగులకు వారి సహాయకులకు, అభాగ్యులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ తైలం శంకర్ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మచారి, మున్సిపల్ చైర్‌పర్సన్ మాధవి, వైస్ చైర్మన్ మధుసూదన్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కదిరే రాములు, అధికార ప్రతినిధులు కోళ్ల వెంకటేష్, శరవంద, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సహదేవ్, బి. కృష్ణ, చీర్ల జనార్ధన్ సాగర్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

whatsapp image 2026 06 19 at 2.18.59 pm

June 19, 2026/

వనపర్తి

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వాసవి క్లబ్ మరియు వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యములో వనితా క్లబ్ సభ్యులు అత్యంత భక్తి శ్రద్ధలతో నెలరోజులపాటు తమ, తమ స్వగృహాలలో "మణిద్వీప వర్ణన పారాయణం"చేసుకొని నేడు మంగళగౌరి దేవి సామూహిక కుంకుమార్చన,అభిషేక పూజలు దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ నందు నిర్వహించబడ్డాయి. నిర్వాహకుల ఆహ్వానం మేరకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇట్టి పూజ కార్యక్రమములో పాల్గొని ప్రజలంతా సౌభాగ్యంగా,సుభిక్షంగా,ఆయురారోగ్యాలతో,అష్టాయిశ్వర్యలతో ఉండాలని మహిళలు మణిద్వీప వర్ణన పారాయణం మరియు గౌరీదేవి కుంకుమార్చన, అభిషేక పూజలు నిర్వహించడం అభినందనీయమని,ఆర్యవైశ్య సామాజిక సేవా సమితి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక సేవలో భాగస్వామ్యులు కావడం నిజంగా అభినందనీయం అని కొనియాడారు. నిర్వాహకులు నిరంజన్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు గట్టు.శశి,రజిత,రాధిక ,ప్రశాంతి,మంజుల,రాఘవేంద్ర,హరీష్,కార్తీక్ లను మాజీ మంత్రి సన్మానించారు. మాజీ మంత్రి వెంట వాకిటి.శ్రీధర్, పలుస.రమేష్ గౌడ్, నందిమల్ల.అశోక్,నాగన్న యాదవ్, దేవర్ల.నరసింహ,చిట్యాల.రాము తదితరులు ఉన్నారు.

whatsapp image 2026 06 19 at 12.32.56 pm

June 19, 2026/

వనపర్తి

"మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును చీకటిలోకి నెట్టే సామాజిక శాపం. డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి యువతను సరైన మార్గంలో నడిపించాలి. ప్రజల సహకారంతో వనపర్తి జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని జిల్లా ఎస్పీ శ్రీమతి సునిత రెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం, దివ్యాంగులు, వృద్ధులు , ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ డైరెక్టర్, హైదరాబాద్ గారి ఆదేశాల మేరకు శుక్రవారం రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో జూన్ 17 నుండి 26 వరకు నషా ముక్త్ సప్తః వారోత్సవాల సందర్బంగా వారం రోజులు అవగాహన కార్యక్రమాలలో భాగంగా అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ "నషా ముక్త్ భారత్ అభియాన్" పోస్టర్ ను జిల్లా ఎస్పీ శ్రీమతి సునిత రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలు వ్యక్తిగత జీవితాలను మాత్రమే కాకుండా కుటుంబాలు, సమాజం మరియు దేశ భవిష్యత్తును కూడా తీవ్రంగా దెబ్బతీస్తాయని అన్నారు. ముఖ్యంగా యువత డ్రగ్స్ బారిన పడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు మరియు అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నషా ముక్త్ భారత్ అభియాన్" కార్యక్రమం ద్వారా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం, యువతను సరైన మార్గంలో నడిపించడం మరియు డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి అందరూ భాగస్వాములు కావడం అత్యంత అవసరమని ఎస్పీ పేర్కొన్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్‌బీ డీఎస్పీ,బాలాజీ, జిల్లా సంక్షేమ శాఖ అధికారి శ్రీమతి కె. సుధారాణి గారు,జిల్లా బాలల పరిరక్షణ అదికాకరి, రాంబాబు, జిల్లా సంక్షేమ సూపరిండెంట్ అరుంధతి, చైల్డ్ ప్రొటెక్షన్ డీసీపీయూ అధికారులు . ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

whatsapp image 2026 06 19 at 5.07.02 pm (1)

June 18, 2026/

వనపర్తి

పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడు పోలీసు శాఖ తనకు అండగా ఉందనే నమ్మకంతో తిరిగి వెళ్లాలి. బాధితులకు న్యాయం చేయడం, ప్రజలకు భద్రత కల్పించడం, నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించడం ప్రతి పోలీసు అధికారికి ప్రధాన బాధ్యతని జిల్లా ఎస్పీ సునిత రెడ్డి అన్నారు. గురువారం వనపర్తి జిల్లా పరిధిలోని పెద్దమందడి పోలీస్టేషన్ " వార్షిక తనిఖీలలో " భాగంగా వనపర్తి జిల్లా ఎస్పీ శ్రీమతి సునిత రెడ్డి సందర్శించి తనిఖీ చేశారు. ముందుగా పోలీస్టేషన్ చేరుకున్న ఎస్పీ గారికి పోలీసు అధికారులు పూల మొక్కలందజేసి స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి పోలీస్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో వాహనాల పార్కింగ్ ప్రదేశాలు, రిసెప్షన్, స్టేషన్ రైటర్, టెక్ టీమ్, ఎస్ హెచ్ వో, మెన్ రెస్ట్ రూమ్ , లాక్ అప్ రూమ్ ను తదితర ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ…పెద్దమందడి పోలీస్టేషన్ పరిధిలో గంజాయి, మట్కా, పేకాట లాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పర్యవేక్షించాలన్నారు. సాయంత్రం సమయాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదాలను అరికట్టాలన్నారు. ముఖ్యంగా కేసుల దర్యాప్తునందు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సరైన సమయంలో దర్యాప్తు చేసి కోర్టుల నందు చార్జిషీటు దాఖలు చేసినప్పుడు బాధితులకు సరైన న్యాయం జరుగుతుందని తెలిపారు. దీర్ఘ కాలికంగా పెండింగ్లో ఉన్న కేసుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పోలీసు సిబ్బంది మాట్లాడుతూ పోలీసుశాఖ అందించిన కిట్ ఆర్టికల్స్ ను పరిశీలించి వాటిని జాగ్రత్తగా ఉంచుకోవాలని తెలిపారు. అలాగే సిబంది నిర్వహిస్తున్న విధులు, పని తీరు, వారికీ ఏదైనా సమస్యలు ఉన్నాయ అని తెలుసుకుని ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురావాలనని స్టేషన్ పరిధిలో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయి అడిగి తెలుసుకొని గ్రామ పోలీస్ అధికారులు గ్రామాలను పూర్తిగా సమాచారం సేకరించి నేరాలు నిర్ములించాలని తెలిపారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ కోర్టును ప్రారంభించి పాఠశాల విద్యార్థులతో వాలీబాల్ ఆడారు ఈ వార్షిక తనిఖీ కార్యక్రమంలో వనపర్తి డిఎస్పీ, గిరిబాబు , కొత్తకోట సీఐ,రాంబాబు , పెద్దమందడి ఎస్సై,జలంధర్ రెడ్డి , డిసిఆర్బి ఎస్సై, తిరుపతి రెడ్డి,పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

whatsapp image 2026 06 18 at 6.54.27 pm

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు వనపర్తి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ భారతదేశ యువతకు ఆదర్శమని, ఆయన స్ఫూర్తితో …

Editor's Pick

Follow Us

Facebook

23k Likes

Twitter

56k Followers

YouTube

58k Subscribers

Instagram

80k Followers

307ce493 b254 4b2d 8ba4 d12c080d6651

Hello, I’m TV Times Voice Admin

Editor and curator at TV Times Voice, delivering verified news and insights across politics, business, technology, startups, and local affairs with clarity and integrity.

Most Read

Scroll to Top