భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలి వనపర్తి భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని, అక్రమంగా తొలగించిన 13 కోట్ల ఓటర్ల జాబితాను తిరిగి పునరుద్ధరించాలని, స్వతంత్ర ఎన్నికల వ్యవస్థ పై మోడీ నియంత ధోరణిని వ్యతిరేకిస్తూ బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలో సిపిఐ, కాంగ్రెస్,సిపిఐ (ఎం ఎల్), సిపిఐ (ఎం),టీ జె ఎ సి, ఎస్ పి, ఎం ఐ ఎం పార్టీల నేతృత్వంలో భారీ ర్యాలీ, అంబేద్కర్ చౌక్,ధర్నా చౌక్ మర్రి కుంట దగ్గర దిష్టి బొమ్మ దగ్ధం మరియు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా … ఆందోళనలో… రోడ్డుపై బేఠాయింపు… కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఉపాధ్యక్షులు తిరుపతయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు నియోజకవర్గ కార్యదర్శి రమేష్ సిపిఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు జిల్లా కార్యవర్గ సభ్యులు ఇంటి జబ్బార్ సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి అరుణ్ కుమార్ జిల్లా నాయకులు గణేష్, టీజేఏసీ పార్టీ జిల్లా అధ్యక్షులు ఖాదర్ బాషా, ఎస్ పి పార్టీ జిల్లా అధ్యక్షులు బాబురావు, జిల్లా నాయకులు జానంపేట రాములు ఇండియా కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
నిరంజన్ రెడ్డి జన్మదినం సందర్భంగా అనూహ్యంగా స్పందించిన రక్తదాతలు వనపర్తి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జన్మదినం సందర్భంగా పలుచోట్ల యువకులు స్వచ్ఛందంగా రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు నిర్వహించి సామాజిక సేవలో పాల్గొన్నారు. నిరంజన్ రెడ్డి గారి స్వగృహంలో బి.ఆర్.ఎస్ విద్యార్ధి, యువజన, సోషల్ మీడియా నాయకులు సూర్యవంశం.గిరి, హేమంత్ ముదిరాజ్, మాధవరావుపల్లె సునీల్ వాల్మీకి, చిట్యాల రాము, జోహెబ్ హుస్సేన్ సహకారంతో 132యూనిట్ల రక్తసేకరణ నాగవరం యువత 60యూనిట్ల రక్తసేకరణ.శ్రీరంగాపూర్ మండలం కంభాలపురంలో 21యూనిట్ల రక్తసేకరణ, సరోజినీ హాస్పిటల్ పెబ్బేరు 65యూనిట్ల రక్తసేకరణ మొత్తంగా 278యూనిట్ల రక్తసేకరణ చేయడం జరిగింది. అపాయ,అత్యవసర పరిస్థితులలో ఉన్న అభాగ్యులను ఆదుకోడానికి అనూహ్యంగా స్పందించి రక్తాన్ని అందించిన ప్రతి ఒక్కరికి గౌరవ మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అభినందించి సన్మానించారు. హంగు,ఆర్భాటాలు లేకుండా పుట్టినరోజు సందర్భంగా సామాజిక సేవలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.గోపాల్ పేట సర్పంచ్ కర్రోళ.స్వప్న భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి వైద్య శిబిరం విజయవంతం అయ్యింది మొత్తం 200మంది పరీక్షలు నిర్వహించగా 30మందికి ఆపరేషన్,72మందికి కళ్ళజోడులు అందించాలని నిర్ణయించారు. ఈ శిబిరంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారిని జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఒక మెమెంటో అందజేశారు.మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వెంట నందిమల్ల.అశోక్, రాజేష్ గౌడ్, వడ్డెమాన్.రవి, సర్పంచ్ శేఖర్, మన్నే నాయక్ తదితరులు ఉన్నారు.
వనపర్తికి రూ.60 కోట్ల రైతు విజ్ఞాన కేంద్రం వనపర్తి వనపర్తి జిల్లాకు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం (TRVK) తీసుకురావాలన్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారి ప్రత్యేక చొరవ ఫలించింది. సుమారు రూ.60 కోట్లతో ఏర్పాటు చేయనున్న TRVKకు పెబ్బేరు మండలం అయ్యవారిపల్లి గ్రామంలో 40 ఎకరాల ప్రభుత్వ భూమికి అడ్వాన్స్ పొజెషన్ ఇస్తూ జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఐఏఎస్ గారు Lr.No.E/1301/2025, తేదీ: 17-09-2026న ప్రొసీడింగ్స్ జారీ చేశారు. TRVK కోసం సర్వే నంబర్ 280లో 10 ఎకరాలు, 281లో 30 ఎకరాలు, 164లో 10 ఎకరాలు కలిపి మొత్తం 50 ఎకరాల ప్రభుత్వ భూమి గుర్తించగా, ఉత్తర్వుల ప్రకారం 40 ఎకరాలకు అడ్వాన్స్ పొజెషన్ ఇవ్వాలని ఆదేశించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే ఈ కేంద్రం ద్వారా రైతులకు ఆధునిక సాగు పద్ధతులు, శాస్త్రీయ సలహాలు, వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం, నిపుణుల మార్గదర్శకత్వం, శిక్షణ కార్యక్రమాలు అందుబాటులోకి రానున్నాయి. జిల్లాలో రైతులు ఎదుర్కొనే వ్యవసాయ సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలు చూపడంతో పాటు కొత్త సాంకేతికతను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో TRVK కీలకంగా ఉపయోగపడనుంది. వనపర్తి రైతుల అవసరాన్ని గుర్తించి ప్రభుత్వ స్థాయిలో ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లి, భూమి గుర్తింపు నుంచి అడ్వాన్స్ పొజెషన్ వరకు ప్రక్రియను వేగవంతం చేసిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారి కృషికి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వనపర్తి వ్యవసాయ రంగానికి కొత్త దిశానిర్దేశం చేసే ఈ కేంద్రం ఏర్పాటుతో రైతులకు ఆధునిక వ్యవసాయ విజ్ఞానం, సాంకేతిక సేవలు మరింత చేరువ కానున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం వనపర్తి లోని నంది హిల్స్ లో గల ఎమ్మెల్యే గారి నివాస కార్యాలయంలో పెబ్బేర్ మండల నాయకులు, వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారికి శాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో పెబ్బేరు మండలాధ్యక్షుడు యాపర్ల రామిరెడ్డి, అయ్యవారిపల్లి లక్ష్మణ్, వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, వనపర్తి పట్టణ అధ్యక్షులు కదిరె రాములు, జిల్లా జర్నల్ సెక్రెటరీ బ్రహ్మంచారి, కౌన్సిలర్లు శరవంద, పరుశురాం, చీర్ల జనార్ధన్ రవి యాదవ్, రఫీక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉంది వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వనపర్తి ప్రజాస్వామ్యంలో ఓటు అనేది సామాన్య పౌరుడికి ఉన్న అత్యంత శక్తివంతమైన హక్కు అని, ఆ హక్కును కాపాడటం ఎన్నికల కమిషన్ ప్రధాన బాధ్యత అని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ల నియామక విధానం, ఎన్నికల ప్రక్రియపై ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ పరిగణనలోకి తీసుకోవాలని మేఘారెడ్డి కోరారు. ఎన్నికల సంఘం స్వతంత్రతను మరింత బలోపేతం చేసే విధంగా ఉండాలన్నారు. ఓటర్ల జాబితాలో ఒక్క అర్హుడి పేరు కూడా అన్యాయంగా తొలగిపోకూడదు. ఓటు హక్కు కోల్పోయిన ప్రతి అర్హుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి” అని మేఘారెడ్డి స్పష్టం చేశారు. SIR పేరుతో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై కూడా వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ ప్రక్రియలో అర్హులైన ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, తొలగించబడిన అర్హులైన ఓటర్ల పేర్లను పరిశీలించి వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత ఉండాలని, పేరు తొలగింపునకు గురైన ప్రతి ఒక్కరికి కారణం తెలియజేయడంతో పాటు తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసుకునే అవకాశం కల్పించాలని మేఘారెడ్డి అన్నారు. పేదలు, సామాన్యులు, వలస కార్మికులు, వృద్ధులు తదితర వర్గాల ప్రజలకు ఓటు హక్కు విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వ్యవహారశైలిపై ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకుని ఆయన వెంటనే రాజీనామా చేయాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్‌పై ప్రజల్లో విశ్వాసం పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, నిష్పక్షపాతత్వం, విశ్వసనీయత అత్యంత ముఖ్యమని ప్రజల ఓటుతో ఏర్పడే ప్రభుత్వాల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అనుమానాలకు తావు ఉండకూడదని స్పష్టం చేశారు.అర్హులైన ఓటర్ల పేర్లను పునరుద్ధరించడం, SIR ప్రక్రియను రద్దు చేయడం, ఎన్నికల కమిషన్ స్వతంత్రతను కాపాడటం వంటి అంశాలపై ఇండియా కూటమి ప్రజల తరఫున తన పోరాటాన్ని కొనసాగిస్తుందని ఎమ్మెల్యే ప్రకటించారు. ఓటు హక్కు ప్రజల హక్కు.. దాన్ని కాపాడటం మనందరి బాధ్యత. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎంతవరకైనా పోరాడుతాం అని మేఘారెడ్డి స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో అఖిలపక్ష పార్టీల నాయకులు సిపిఐ పట్టణ సెక్రెటరీ రమేష్, సిపిఎం జిల్లా సెక్రెటరీ పుట్ట ఆంజనేయులు, జబ్బార్, డి కురుమయ్య, ఎంఐఎం జిల్లా అధ్యక్షులు రహీం, తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఖాదర్ బాషా, బాబు గౌడు, గణేష్, మండ్ల రాజు,కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతయ్య, ప్రధాన కార్యదర్శి బ్రహ్మచారి, మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, కోళ్ల వెంకటేష్, బి. కృష్ణ, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
మోదీ అమిత్షాలకు ఊడిగం చేస్తున్న సీఈసీ జ్ఞానేష్ కుమార్: వామపక్షాలు వనపర్తి సిపిఐ -సిపిఎం -సిపిఐ (ఎంఎల్ )మాస్ లైన్ వామపక్ష పార్టీల జిల్లా కమిటీ ల ఆధ్వర్యంలో మోడీ ప్రభుత్వ కీలుబొమ్మ గా ఎన్నికల వ్యవస్థలు దెబ్బతీస్తున్న కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, ఎస్ ఐ ఆర్ ను రద్దు చేయాలని, తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని పాలిటెక్నిక్ కళాశాల నుండి ప్రదర్శన నిర్వహించి రాజీవ్ చౌక్ లో ఎర్రజెండాలతో నల్ల బ్యానర్ తో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.డి. జబ్బార్, సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, సిపిఐ( ఎంఎల్ )మాస్ లైన్ జిల్లా కార్యదర్శి హనుమంతు లు పాల్గొని ప్రసంగిస్తూ దేశం ఒక అసాధారణ పరిస్థితిని ఎదుర్కొంటుందని పాసిస్తూ సంస్థ ఆర్ఎస్ఎస్ నియంత్రణలో ఉన్న బిజెపిని ఒక సాధారణ రాజకీయ పార్టీగా పరిగణించకూడదని ఆర్ఎస్ఎస్, బిజెపిలు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ సహాయంతో దేశంలోని మొత్తం ఎన్నికల వ్యవస్థను తారుమారు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. జ్ఞానేశ్ కుమార్ జ్యోక్యాలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ పరిస్థితులు చిన్న పెద్ద సమస్యలు ఏకమై పెద్ద ఎత్తున ఆత్మ రక్షణకు సిద్ధంగా ఉండాలి. రాజకీయ పార్టీలతో పాటు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న సామాజిక మానవ హక్కుల కార్యకర్తలు, కళాకారులు, మేధావుల మద్దతు కూడా కావాలని అన్నారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయకపోతే ఈ ఉద్యమం ఇక్కడితో ఆగబోదని కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దింపే ఉద్యమంగా మారుతుందని హెచ్చరించారు. సీ ఈసీ జ్ఞానేష్ కుమార్ కాకుండా బిజెపికి ప్రధాని మోడీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సర్ ప్రక్రియ వల్ల రాష్ట్రాల్లో ప్రభుత్వాలే మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్లో బిజెపికి వ్యతిరేకంగా ఉండే 37 లక్షల ఓట్లను తొలగించడంతో బిజెపి అధికారంలోకి వచ్చిందన్నారు. తమిళనాడులో డీఎంకే ఓడిపోయిందని తెలిపారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగితే బిజెపి ఓడిపోయే పరిస్థితి ఉన్నందుని బిజెపి వ్యతిరేక ఓట్లు సుమారు పదమూడున్నర కోట్ల ఓట్లను ఈసీ తొలగించిందని విమర్శించారు. బిజెపి మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు ఈసీ ద్వారా ప్రయత్నం చేస్తున్నదని చెప్పారు. సి ఈసి జ్ఞానేష్ కుమార్ గారి రాజీనామా చేయాలని ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణం ఎస్ఐఆర్ ను రద్దు చేయాలని, తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం రాజు అధ్యక్షతన జరిగింది. CPI జిల్లా కార్యవర్గ సభ్యులు కళావతమ్మ, AITUC జిల్లా కార్యదర్శి మోష, రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాబర్ట్, ఉపాధ్యక్షులు పృథ్వినాదం, సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్, సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, లక్ష్మినారాయణ NFIW జిల్లా ఉపాధ్యక్షులు జయమ్మ,శిరీష, AISF జిల్లా ఉపాధ్యక్షులు వంశీ,ప్రసాద్, నాయకులు కృష్ణయ్య, వెంకటమ్మ,నాగమణి, లావణ్య,చంద్ర శేఖర్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి. బాల్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఎస్.రాజు, ఆర్. ఎన్. రమేష్, బాల్య నాయక్, గుంటి వెంకటయ్య, ఎం. పరమేశ్వర చారి, సిపిఐ ఎంఎల్ జిల్లా నాయకులు ప్రసాద్,రాజు, గణేష్,కృష్ణవేణి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నిక సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్స్ వనపర్తి హైద్రాబాద్,రంగారెడ్డి,పాలమూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగింది. ఇట్టి సమావేశములో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాధ్యతగా వ్యవహరించాల్సిన వ్యూహాలను ఉదాహరిస్తూ దిశా నిర్దేశం చేశారు. ఉద్యోగులు,నిరుద్యోగులు తమకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్ల తీవ్ర అసంతృప్తి తీవ్రంగా వ్యక్తం చేస్తున్నారు కాబట్టి శ్రేణులు ఒక నెలపాటు శ్రద్ధ వహించి ఓటరు నమోదు చేయాలని ఆదేశించారు. మాజీ మంత్రి మాట్లాడుతూ పట్టభద్రులు అందరూ తాజాగా ఓటు నమోదు చేసుకోవాలని అన్నారు. పార్టీ శ్రేణులు గ్రామ,గ్రామానా పట్టభద్రులను కలసి ఓటు నమోదు చేయించాలని అన్నారు 43నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది అన్నారు. సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్స్ ఎమ్మెల్సీ ఎన్నిక. ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి ఉంది కాబట్టి గెలుపు అవకాశాలు ఎక్కువ. అభ్యర్థి విషయంలో పార్టీ నిర్ణయం శిరోధార్యం అని అన్నారు .
ముఖ్యమంత్రి సహాయ నిధిలో మేఘా మార్క్ CMRFలో 7,872 మందికి దాదాపు రూ.20 కోట్లుLOC ద్వారా 469 మందికి రూ.91850000 కోట్ల వైద్యసాయం వనపర్తి ఒక పేద కుటుంబంలో అనారోగ్యం అంటే కేవలం ఒక మనిషి ఆరోగ్య సమస్య కాదు. ఆ కుటుంబం మొత్తం ఆర్థికంగా కుంగిపోయే పరిస్థితి. ఆసుపత్రి ఖర్చులు ఎలా భరించాలో తెలియక, వైద్యం ఎక్కడ చేయించాలో అర్థంకాక, చివరకు ఎవరి సాయం కోరాలో తెలియని కుటుంబాలకు ఆ సమయంలో ఒక భరోసా కావాలి. అలాంటి ఆపద సమయంలో అన్నా అని పిలిస్తే.. “నేనున్నా” అంటూ ముందుకు వస్తున్నారు. వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF), లెటర్ ఆఫ్ క్రెడిట్ (LOC) ద్వారా నియోజకవర్గంలోని నిరుపేదలకు వైద్యపరమైన సహాయం అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అనారోగ్యంతో కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో పడకుండా, అర్హులైన వారికి ప్రభుత్వ సహాయం సకాలంలో అందేలా ఎమ్మెల్యే కార్యాలయం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి నిరంతరం సేవలందిస్తూ వస్తుంది. ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా ఇప్పటివరకు 7,872 మంది లబ్ధిదారులకు రూ.19,98,40700, అంటే దాదాపు రూ.20 కోట్ల మేర ఆర్థిక సహాయం అందింది. పేద కుటుంబాల్లో తీవ్రమైన అనారోగ్యానికి గురైన వారికి వైద్య ఖర్చుల భారాన్ని కొంతమేర తగ్గిస్తూ ఈ సహాయం అండగా నిలుస్తోంది 2026 అక్టోబర్ 2 నాటికి వనపర్తి నియోజకవర్గంలో CMRF కింద 7,872 మందికి రూ. 20 కోట్ల సాయం నేరుగా లబ్ధిదారులకు అందించారు. CMRFతో పాటు అత్యవసరంగా, ఖరీదైన వైద్యం అవసరమైన వారికి Letter of Credit (LOC) ద్వారా కూడా మేఘారెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఇప్పటివరకు 469 మందికి రూ.9,18,50000 విలువైన LOC సహాయం అందించారు. అనారోగ్యంతో పోరాడుతున్న మనుషులు, వైద్య ఖర్చులతో సతమతమవుతున్న కుటుంబాలు, తమవారిని కాపాడుకోవాలనే ఆరాటంతో సహాయం కోసం ఎదురుచూసిన ఎన్నో జీవితాలు ఉన్నాయి. అందుకే ప్రతి దరఖాస్తును కేవలం ఒక ఫైల్‌గా కాకుండా, ఒక కుటుంబ సమస్యగా చూడాలన్న దృక్పథంతో ఎమ్మెల్యే కార్యాలయం వ్యవహరిస్తోంది. ప్రభుత్వ సహాయం కోసం ప్రజలు వనపర్తి నుంచి హైదరాబాద్ వరకు తిరుగుతూ ఇబ్బందులు పడకుండా వనపర్తి, హైదరాబాద్‌లో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి CMRF, LOC వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు శాసనసభ్యులు మేఘారెడ్డి బాధితులు ఇంటి వద్ద బయలుదేరినప్పటి నుంచి వాళ్లకు చికిత్స జరిగి తిరిగి ఇంటికి చేరుకునేంతవరకు ఎమ్మెల్యే గారి పర్యవేక్షణలోనే సిబ్బంది ఎటువంటి ఇబ్బందు లు లేకుండా బాధితులను చూసుకోవడం గర్వకారణం దరఖాస్తు ప్రక్రియ, అవసరమైన పత్రాలు, సంబంధిత అధికారులతో సమన్వయం, తదుపరి చర్యలు.. ప్రతి దశలో బాధిత కుటుంబాలకు సహకారం అందించేలా ప్రత్యేక వ్యవస్థ కొనసాగుతోంది. CMRF కోసం ప్రతి నెలా సుమారు 1,200 నుంచి 1,500 వరకు ఆన్‌లైన్ దరఖాస్తుల ఎక్కడ జాబిల్లి లేకుండా ఆన్లైన్ చేస్తూనే వస్తున్నారు. మరోవైపు అత్యవసర వైద్య అవసరాలున్న వారికి ప్రతి నెలా సుమారు 15 నుంచి 20 LOC కేసుల పరిష్కారానికి సహకరిస్తున్నారు. వీటి ద్వారా తక్కువకు తక్కువ రూ.పదివేల సహాయం నుంచి రూ. ఐదు, ఆరు లక్షల వరకు సహాయం అందుకుంటున్నారు లబ్ధిదారులు అత్యంత ముఖ్యంగా.. పార్టీలకతీతంగా ఆపదలో ఉన్న అర్హులైన ప్రతి కుటుంబానికి సహాయం అందేలా ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. అనారోగ్యం వస్తే అప్పులు చేయాల్సిన పరిస్థితి రాకూడదని, డబ్బుల కొరతతో మంచి వైద్యం దూరం కాకూడదని.. ప్రభుత్వం అందించే సహాయాన్ని సకాలంలో ప్రజలకు చేరవేయడమే మేఘారెడ్డి ప్రత్యేక శ్రద్ధగా మారింది. అందుకే CMRF, LOC సేవలు వనపర్తి నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాలకు ఒక భరోసాగ నిలుస్తున్నాయి.
సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు వనపర్తి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలే కాకుండా, అదనంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నాం : రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలనే కాకుండా, ఇంకా అదనంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు. వనపర్తి జిల్లాలో సాగునీటి రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ కర్నె తండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సహచర అబ్కారి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి సోమవారం మోటార్లను ఆన్ చేసి ప్రారంభించారు. రూ.87.53 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ద్వారా వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోని 18 తండాల పరిధిలో మొత్తం 4,235 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం చెప్పిన హామీలను అమలు చేయడంతో పాటు చెప్పని అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపడుతోందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు నిర్మించుకునేందుకు పేదలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని, రాష్ట్రాన్ని గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, సుమారు రూ.36 వేల కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కర్నే తాండ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని పేర్కొంటూ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కర్నె తండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా వనపర్తి జిల్లాలో 3384 ఎకరాలకు, నాగర్ కర్నూల్ జిల్లాలో 851 ఎకరాలు కలిపి మొత్తం 4,235 ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు తెలిపారు. ప్రాజెక్ట్ ప్రారంభంతో ఈ ప్రాంత రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. గిరిజనుల ఆకాంక్ష మేరకు ప్రాజెక్టు పేరును గిరిజనుల ఇష్టదైవం అయిన శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌గా పేరు మార్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు. ఇదే కాకుండా పాలమూరు ప్రాజెక్ట్‌ను పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. అనంతరం వనపర్తి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ తో కలిసి సర్జ్ పూల్ వద్ద ప్రారంభమైన నీటి ప్రవాహానికి పూజలు చేసి పూలు సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, నాగర్ కర్నూల్ ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలియుగ దైవం శ్రీ శ్రీ శ్రీ తిరుమలనాథుడిని దర్శించుకున్న మాజీ ఎం.పి.రావుల. వనపర్తి వనపర్తి మండలం పెద్దగూడెం శివారులోని తిరుమలయ్య గుట్ట మీద వెలసిన ఆరాధ్యదైవం తిరుమలనాతుణ్ణినీ మాజీ ఎం.పి రావుల.చంద్రశేఖర్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సాదరంగా ఆహ్వానం పలికి ఘనంగా సన్మానించారు. శ్రావణ మాసం సందర్భంగా తిరుమలయ్య గుట్ట మీద అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి అని ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజిస్తారని రావుల అన్నారు. రాబోవు కాలములో కె.సి.ఆర్ గారి నాయకత్వములో నిరంజన్ రెడ్డి సహకారంతో తిరుమలయ్య గుట్టను పర్యాటక పుణ్య క్షేత్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. జాతరలో వెలసిన మిఠాయి దుకాణాలలో స్వీట్ ఖరీదు చేసి తనతో పాటు వచ్చిన భక్తులకు,నాయకులకు పంచి ఆనందాన్ని,బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. రావుల చంద్రశేఖరరెడ్డి గారి వెంట గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ నందిమల్ల అశోక్,ఉంగ్లం. తిరుమల్,ధర్మా నాయక్,మాధవ్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి,బీచ్యనాయక్, కృష్ణా నాయక్,నాగరాజు నాయక్,యాదయ్య, కొత్తకోట.బాలయ్య, లక్ష్మణ్ గౌడ్ శివప్రసాద్ గౌడ్ తదితరులు ఉన్నారు.
ప్రజా పోరాటాల సూరీడు సురవరం : సిపిఐ వనపర్తి ప్రజా పోరాటాల సూర్యుడు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి అని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీరామ్ అన్నారు. శనివారం సిపిఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ప్రథమ వర్ధంతిని నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాట్లాడుతూ.. ఏఐఎస్ఎఫ్ లో విద్యార్థినేతగా జీవితం ప్రారంభించి ఏఐవైఎఫ్ నేతగా ఎదిగి కార్మిక కర్షక బడుగు బలహీన వర్గాల పక్షాన అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా, అనంతరం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు అన్నారు. రెండుసార్లు ఎంపీగా పని చేశారని జీవితమంతా ఉద్యమాలతోనే గడిచిందన్నారు. దేశంలో సిపిఐ బలోపేతానికి గ్రామాలకు సైతం వెళ్లిన చరిత్ర ఆయనదన్నారు. కమ్యూనిస్టుగా ఆదర్శభావాలతో నిరాడంబర జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. దేశ విదేశాల్లో మేధావిగా, గంభీరమైనవక్తగా ప్రశంసలు పొందారన్నారు.వలస జిల్లా బతుకులను వెలుగులోకి తెచ్చిన సురవరం ఉమ్మడి పాలమూరు వలస బతుకులపై ఆయనపలు వేదికల్లో గళమెత్తరన్నారు. కరువు జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణం అవసరం నొక్కి చెప్పటమే గాక ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారన్నారు. పాలమూరు జిల్లా ఆకలి చావులను రాష్ట్ర కేంద్ర పాలకుల దృష్టికి ఇచ్చేందుకు జిల్లా నుంచి హైదరాబాద్కు పాదయాత్రలు నడిపారని, ఆకలి చావులను నివారించేందుకు పార్టీ పక్షాన అన్నం, అంబలి కేంద్రాల ఏర్పాటుకు కృషి చేశారన్నారు. వనపర్తి జిల్లాతో ప్రత్యేక అనుబంధం వనపర్తి జిల్లాతో సురవరం సుధాకర్ రెడ్డి కి ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. వనపర్తి జిల్లా ఆఫీసును ఆయన జాతీయ కమిటీ సభ్యుడిగా ఉండగా ప్రారంభించారన్నారు. అనారోగ్యంలోను హైదరాబాద్ వెళ్తే వనపర్తి లో పార్టీ పరిస్థితిపై ఆరా తీసేవారన్నారు. అనారోగ్యంలోనూ వనపర్తి జిల్లా కమిటీ అవసరాల కోసం రూ. 20000 సొంత డబ్బు అందజేసిన గొప్ప మనసు ఆయనదన్నారు. ఉన్నత కులంలో పుట్టి, పార్టీ కోసం పేదల అభ్యున్నతి కోసం జీవితాన్ని ధారబోసిన ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఆయన ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరు కంకణ బద్ధులు కావాలన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీరామ్, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు వంశీ, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్న కురుమన్న, సురేష్,ఎన్ఎఫ్ఐ డబ్ల్యు సభ్యురాలు వెంకటమ్మ, తదితరులు పాల్గొన్నారు.